ఓజి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు... పవన్ కళ్యాణ్, సుజిత్ తర్వాత అంత హై రేంజ్‌లో పొగిడిన పేరు ఇంకా ఎవరు ఉన్నారు అని అంటే "తమన్" ఇది కచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఈ సినిమాలో ముగ్గురు మాత్రమే హైలెట్ గా నిలిచారు. డైరెక్షన్ విషయంలో సుజిత్ 100% న్యాయం చేసారని చెప్పాలి. అలాగే నటన విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులను సాటిస్ఫై చేయడానికి ఎంత కష్టపడ్డారో, అది డబుల్ రేంజ్ కాదు, ట్రిపుల్ రేంజ్‌లోనే ఓజీ సినిమా విశేషంగా చూపించింది. ఇక తమ్న్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవల్ అని చెప్పుకోక తప్పదు.


సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా, సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది.  అంతేకాదు  బాక్సాఫీస్ హిస్టరీని కూడా తిరగరాసింది. ప్రీమియర్స్‌తో కలిపి, మొదటి రోజే దాదాపు 154 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి, ఓజీ సినిమా ప్రత్యేక రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా, ఓజీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ వచ్చి బాక్సాఫీస్ వద్ద గత రికార్డులను బ్లాస్ట్ చేసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు జనాలు.



పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్—సినిమా మొత్తం తన ప్రాణాన్ని పెట్టి తీసుకెళ్ళాడు. చాలా బాగా మ్యూజిక్ స్పెషల్‌గా అందించాడు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూలో తమన్ దీని గురించే మాట్లాడారు. “రామ్ చరణ్ ఓజీ సినిమా చూసి మ్యూజిక్ విషయంలో కాల్ చేశాడు అని చెప్పుకొచ్చారు. ‘ఏంటి, ఫైర్ మోడ్ లో మ్యూజిక్ అందించావ్.. చేతికి కిరోసిన్ రాసి వాయించావా? అదిరిపోయింది!’ అని అనగానే  నేను షాక్ అయ్యాను, ఒక పాట నన్ను ఇలా పొగడడం ఆశ్చర్యంగా అనిపించింది. ‘అన్నా, మీరు భలే పదాలు వాడతారు’ అని సరదాగా చెప్పుకున్నాము” అంటూ తమన్ చెప్పుకొచ్చారు.  ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



నిజానికి సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, తమన్‌ని ఒక రేంజ్‌లో అభిమానులు ట్రోల్ చేశారు, “కాపీ రాజు” అంటూ ట్యాగ్ చేసి ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తమన్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగిపోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: