తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకుల రాజకీయాలు సొంత పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు ? ఎవరికి ఎప్పుడు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారో కనీసం వారికి అర్థం కావడం లేదు అంటూ తిట్టిపోస్తున్నారు. కొడుకును ప్రమోట్ చేసేందుకు తండ్రి, తండ్రి 40 ఏళ్ల రాజకీయ ఎత్తుగడలు అన్నిటిని ఒక్కసారే నమిలి మింగాలి అన్నట్లుగా కొడుకు ప్రయత్నిస్తూ సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే పార్టీలో నాయకులు ఆగ్రహానికి కారణం అవుతోంది.



 తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించేందుకు స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని వచ్చినా, టిడిపి స్టీరింగ్ పట్టుకోవాలని ఆత్రుతతో నిండా జనాలను ఎక్కించుకుని మరి , ప్రమాదానికి గురి చేస్తుండటం తో .... పార్టీ బాధ్యతలు తీసుకోకు ముందే, స్టీరింగ్ అదుపు తప్పితే, ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత అదుపు చేయ గలరా అనే భయం ఇప్పుడు పార్టీ నాయకులకు వస్తోంది. అయితే కొడుకును ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఉన్న తండ్రి, ఈ ప్రమాదాన్ని శుభసూచకం అన్నట్లుగా భావిస్తూ, కొడుకుకి కుదుపులు లేని ప్రయాణం అందించేందుకు రోడ్డు నిర్మించే పనులు ఉన్నారు.



 దీనికి తోడు కుల బలం డబ్బు ఉండడంతో,  బలహీనుడు ని కూడా బాహుబలి గా చూపించగల సత్తా ఉన్న కొన్ని బాకా చానళ్లు, పేపర్లను పట్టుకుని కొడుకును ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. జిల్లాల పర్యటన లు చేస్తూ, జనాల్లో, నాయకుల్లో ఉన్న పలుకుబడి పెంచుకుని, ఏదో రకంగా కుర్చీ ఎక్కాలి అనే తాపత్రయంలో కొడుకు ఉండగా, తాను ఎంతో కాలం యాక్టివ్ గా ఉందను అని తెలిసినా, కొడుకే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే పార్టీ మరింతగా దెబ్బతింటుందనే భయం తో నో , 2024 లో ఉన్న తానే ముఖ్యమంత్రి అని చెప్పించుకుని, పార్టీకి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు తండ్రి పడుతున్న తాపత్రయం మీదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పొద్దు చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: