ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. తెలుగు వారి తొలి పండుగ ఈ ఉగాది పండుగ. ఈ పండుగ నాడు ప్రజలు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. యుగయుగాల నుండి వస్తున్న సాంప్రదాయం మన ఉగాది. ఉగాది అనే పదం ఉగ, ఆది నుండి వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం అలానే ఆది అంటే మొదలు లేదా ప్రారంభం.

 

IHG

 

ఇది తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం. చైత్ర  శుక్ల పాడ్యమి నాడే సృష్టి జరిగిందట. అంటే ఉగాది నాడే సృష్టి జరిగింది అని పూర్వికులు అంటారు. ఉగాది ఒక్క రోజు ఉత్సవమే. పండుగ రోజు చక్కగా తెల్లవారే నిద్ర లేచి ఇల్లు, పరిసరాలు శుభ్ర పరుచుకుని, మామిడి తోరణాలతో అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలానే అన్నింటి కంటే ముఖ్యం అయినది ఉగాది పచ్చడి.

 

పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇలా వీటి అన్నింటితో ఉగాదిని జరుపుకుంటారు. అయితే అందరికి ఒక్క పచ్చడి మాత్రమే తెలుసు. కానీ అది మాత్రమే కాక మరెన్నో ఉన్నాయి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజనం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి.

IHG

 

పండుగ రోజున గోపూజ కూడా చేసుకుంటారు. అంటే గోవులకు పూజ చేసి అరటిపళ్ళు వంటివి వాటికి పెడతారు. అలానే పంచాంగం  శ్రవణం కూడా ముఖ్యం అయినది. బ్రాహ్మణుడిని ఇళ్ళకి పిలిచి ఉదయాన్నే పూజ చేయించుకుని పంచాంగ శ్రవణం చెప్పించుకోవడం ఆచారం. తిధి, వార, నక్షత్రాల తో కూడుకున్న పంచాంగాన్ని విని ఆ సంవత్సర ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంది. అయితే సంవత్సరం అంతటిని వింటూ తగ్గట్టు ప్రణాళిక వేసుకుంటారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: