తెలుగు ప్ర‌జ‌లు జ‌రుపుకునే ముఖ్య‌మైన పండుగ‌ల్లో ఉగాది పండుగ మొదటిది. ఈ ఉగాది పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ఉగాది పండుగను కొత్త యుగానికి నాంది పలికిన రోజుని అంటారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం సృష్టి ఏర్పడిన రోజు ఉగాది అని అంటారు. 

 

ఇకపోతే భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ,ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇకపోతే శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. 

 

ఇంకా ఉగాది నాడు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు అంత కూడా ఈ పండుగను మొదటి పండుగగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగ రోజునా కొత్త పనులు ప్రారంభించుట అన్ని విధాలా మంచి జరుగుతుంది కాబట్టి.. తెలుగుఇంటి మహిళలు అంత కూడా తెల్లవారు జామునే నిద్ర లేచి ఇల్లు అలికి రుచికరమైన వంటకాలు చేసుకొని.. ఉగాది పచ్చడి చేసుకొని తినండి. ఉగాది పండుగాను ఇంట్లోనే ఘనంగా చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: