వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం ‖
దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలః |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ‖
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
పైన చెప్పిన మంత్రాలను ప్రతిరోజు పఠిస్తే మనకంతా శుభమే కలుగుతుంది. మంతరాలను ఆచరించినంత మాత్రాన కార్యాలు వాటంతటికి అవే జరగవని గుర్తించుకోండి. మన ప్రయత్నం చేసి, తరువాత దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడూ కూడా పూజ చేస్తున్నామంటే పూర్తి నిష్ఠతో, శ్రద్ధగా చేయాలి, అప్పుడే మీరు చేసే పూజకు ప్రతి ఫలం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనకు తోచిన సహాయాన్ని లేని వారికి చేయడం ఉత్తమం. అప్పుడు ఈమెకు కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి