మనకు నాగదోషం ఉన్నట్టయితే ముఖ్యంగా సంతానం భాగ్యం అనేది కలగదు అని చెప్తున్నారు. లేకుంటే సంతానం కలిగి  మిగలక పోవడం అనేది, లేదా గర్భస్రావం జరగడం అనేది జరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. మనం ఇందులో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన వైద్య పరంగా  ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సంతాన అభివృద్ధి చెందకపోవడం వీటన్నిటికి ముఖ్యంగా నాగదోషం అనేది ఉంటుందని చెబుతారు. మరి అసలు నాగ దోషం అంటే ఏమిటి. తెలుసుకుందాం..? వాళ్లు కానీ వాళ్ల పూర్వీకులు కానీ ఎవరైనా సరే నాగు పామును చంపి నట్లయితే లేదా పాములు రెండూ కలిసి ఉన్న సందర్భంలో చూసినా, అయితే మనుషులు తప్ప ఏ జంతువు అయినా సరే అది రెండు కలిసినప్పుడు బయట వారు చూడడానికి అస్సలు ఇష్టపడవు. ఇందులో ముఖ్యంగా సర్పాలు ఆడ మగ కలిసి నప్పుడు అవి చాలా సిగ్గు పడి ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

 ఈ సందర్భంలోనే మనకు నాగ దోషం వస్తుంది. ఒక్కోసారి ఈ నాగదోషం ఉండటం వల్ల నాగు పాములు పగబడతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నాగుపామును చంపినప్పుడు దానికి తప్పనిసరిగా దహన సంస్కారాలు నిర్వహించి బూడిద చేయాలి. దహనం చేసేటప్పుడు అందులో ఒక రాగి నాణెం వేసి తగలబెట్టాలి. ఇలా చేయకపోతే మాత్రం మనకు తరతరాలుగా నాగదోషం అనేది పట్టుకు పీడిస్తుంది. దీనివల్ల మనకు సంతానం అనేది కలగకుండా ఉంటుంది. దీనికి ప్రధానంగా పరిహారం ఏంటంటే ఎక్కువగా రామేశ్వరం వెళ్లి అక్కడ నాగుపాము ప్రతిమను ప్రతిష్ట చేస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని స్థలాలలో జంట నాగులు చెక్కబడి ఉంటాయి వాటికి మనం పూజ చేయడం. లేదా పుట్టలో పాలు పోయడం లాంటివి చేస్తే ఈ దోషం పోతుంది. అలాగే ప్రతి శుద్ధ చవితికి పుట్టలో పాలు పోస్తూ నియమాలు పాటిస్తే స్త్రీకి గర్భధారణకు అడ్డుపడే అటువంటి శారీరక పరిస్థితుల్ని పరిష్కరించేవే. ముఖ్యంగా నియమాలు ఏంటంటే వాడిన పదార్థాలు తినకపోవడం, చలిమిడి, చీమ్మిలి అనే పదార్థాలను నాగుల చవితి రోజు నైవేద్యంగా పెట్టి వాటిని తినాలని పూర్వీకుల నుంచి చెబుతున్నారు. అయితే ఇవి తినడం వలన మనకు చలవ చేయడమే కాకుండా, గర్భధారణకు సంబంధించిన ఈ రెండు ఆహారాలు తింటే మనకు సంతానం అనేది కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అంటే సైన్సు ప్రకారం ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ గర్భధారణకు ముఖ్యంగా ఉపయోగపడతాయని తెలియజేస్తారు. ముఖ్యంగా సర్పదోషం అనేది పురుషులకు సంబంధించింది. ఎందుకంటే  పురుషుల స్పెర్ము ద్రవపదార్థం లో తేలియాడుతూ సంతానోత్పత్తికి ఉపయోగపడతాయి. ఈ స్పెర్ము లు బయట ఉండే పడగవిప్పిన నాగుపాములగా కనబడతాయి. అంటే వీటికి నాగుపాములకి ఏదో సంబంధం ఉందని అందుకే నాగ దోషం ఉంటే సంతాన భాగ్యం కలగదని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: