భారతీయ హిందూ సంప్రదాయంలో తులసిమొక్కకు పవిత్రమైన స్థానం ఉంది.ప్రతి ఒక్క హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా తులసి మొక్కను పెట్టుకొని, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి, లక్ష్మిదేవి ప్రతిరూపంగా భావించి పూజలు నిర్వహిస్తుంటారు.కానీ తులసిమొక్క విషయంలో కొన్ని తప్పులు చేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు హెచ్చరిస్తున్నారు. మనం తెలిసి,తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లే, మన కుటుంబంలో కలిగే సమస్యలకు కారణాలు అవుతాయి.మరి తెలియకుండా చేసే తప్పులు ఏంటో, వాటిని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు చూద్దాం..


1. శాస్త్రం ప్రకారం.. తులసిచెట్టు పెట్టిన కుండిలో శివలింగాన్ని పెట్టకూడదు.పూర్వం జలంధరుడు అనే రాక్షసుడి సతీమణి అయిన తులసిని గత జన్మలో బృందా అనే పేరు పిలిచేవారట. ఆ జలంధరుడిని బోలాశంకరుడు సంహరించాడని, అప్పటినుండి తులసికి, శివునికి మధ్య వైరం వచ్చందని పురాణాలూ చెబుతున్నాయని, అందుకే శివుడిని తులసితో పూజించరని పండితులు సూచిస్తున్నారు.

2. తులసిమొక్క పెట్టిన కుండీలో వినాయక విగ్రహం పెట్టకూడదని, వేదపండితులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం పూర్వం వినాయకుడు ఒక నది ఒడ్డున తపస్సు చేస్తుండగా, అందులో స్నానం చేస్తున్న తులసిదేవి బయటకు వచ్చినప్పుడు,ఆమె వినాయకుని అందం చూసి,ముగ్ధురాలై,పెళ్లి చేసుకోమని అడుగుతుంది. వినాయకుడు ఆమె ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆగ్రహించిన తులసీదేవి వినాయకుని, నీవు రెండు వివాహాలు చేసుకుంటావని శపిస్తుంది. అందువలన తులసిమొక్క దగ్గర వినాయకుని విగ్రహం పెట్టి పూజలు చేయకూడదు.

3.తులసి మొక్క ఉన్న ప్రదేశం చుట్టూ చెప్పులు, బూట్లు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి,ఇట్టి నుంచి వెళ్ళిపోతుంది. దాని  కారణంగా ఇంట్లో అశాంతి మరియు ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి.

4. తులసిమొక్క  దరిదాపుల్లో కూడా ఎప్పుడూ చెత్త బుట్టను పెట్టకూడదు. దానివల్ల మన ఇంట్లో సంపాదన కరిగిపోయి,కటిక దరిద్రం వస్తుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి  

5. చీపురును తులసిమొక్క దగ్గరలో, తాకేలాగా పెట్టకూడదు .దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు కలిగి, కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: