శ్రావణమాసం వచ్చేసింది , ఇది చాలా చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆడవాళ్లు ఈ శ్రావణమాసంలో కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు . అలా చేస్తే వాళ్లకే కాదు ఇంటికి కూడా చాలా చాలా అశుభం అంటున్నారు పండితులు . శ్రావణమాసం అంటేనే లక్ష్మీదేవిని ఇంట్లో ఆడవాళ్ళతో పోలుస్తూ ఉంటారు . ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్లని బాగా రెడీ చేయాలి.  ఆడవాళ్లు చక్కగా కలకలాడుతున్న ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి సిరిసంపదలు కురిపించేలా చేస్తుంటుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం .

అయితే శ్రావణమాసంలో ఆడపిల్లలు మరీ ముఖ్యంగా పెళ్లి అయిన ముత్తైదువులు ఎప్పుడూ నిండు పసుపు కుంకుమలతో సాంప్రదాయ బద్దంగానే కనిపించాలి అంటున్నారు పండితులు.  కొంతమంది శ్రావణమాసంలో కేవలం శుక్రవారం మాత్రమే బాగా చక్కగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటారు.  కానీ అలా చేయడం కన్నా కూడా శ్రావణమాసం మొత్తం కూడా ఆడవాళ్లు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో ధూప దీపాలతో పూజలు చేస్తూ.. నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి పూజలు చేస్తే వాళ్లు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటున్నారు .

మరి ముఖ్యంగా ఆడవాళ్ళ నోటి నుంచి బూతు మాటలు అదే విధంగా ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం ..ఈ శ్రావణమాసంలో అస్సలు చేయకూడదట.  అది ఇంటికి అశుభంగా మారుతుందట.  చేతినిండా గాజులు .. ముఖం నుదుట బొట్టు ..పాపిట సింధూరం ..తలలో పూలు ..కాళ్ళకి పట్టీలు.. పెళ్లయిన  ముత్తైదువులు మెడలో తాళి ..నల్లపూసలు ..కాళ్ళకి మెట్టెలు ఇలా నిండుగా కనిపిస్తే ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ  ఆసీనురాలై ఉంటుందట.  అలా కాకుండా కొంతమంది ట్రెండ్ అంటూ జుట్టు విరబోసుకోవడం ..శ్రావణమాసంలో కూడా ఎప్పుడో ఉదయం 10 గంటలకు నిద్ర లేవడం.. పళ్ళు తోముకోకుండానే వంటగదిలోకి వెళ్లడం .. ఇలాంటివి చేస్తే ఆ ఇల్లు అనుకున్నంత వృద్ధిలోకి రాదు అంటున్నారు పండితులు..!

నోట్ : ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొందరి పండితులు చెప్పిన విధంగా ఇవ్వబడినది. దీనిని ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: