వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు
- తొమ్మిది నుంచి 17 మందికి పెంపు
కోనసీమ తిరుమలగా దినదినాభివృద్ధి చెందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకారం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఇదే అతిపెద్ద ట్రస్ట్ బోర్డ్. ఎందుకంటే ఈ ఆలయ కమిటీ కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా వాడపల్లి గ్రామస్థాయిలోనే ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయపురం మండలానికి విస్తరించింది. నిన్న మొన్నటి వరకూ కొత్తపేట నియోజకవర్గానికి విస్తరించింది.ఆ తర్వాత జిల్లాకు విస్తరిస్తుందని అందరూ భావించారు. కాని ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాలకే వ్యాప్తి చెందింది.అలాగే తొమ్మిది మందితో ఉండే ఈ దర్మకర్తల మండలి 17 మందితో పాటు ఇద్దరు ఎక్స్ అఫిషియల్ మెంబర్లను నియమించారు. అందుకనే ఈ ట్రస్ట్ బోర్డు నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావించింది. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా నియమాకానికి ఇంత జాప్యం జరగడానికి కూడా ఇదే కారణం.
ఛైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో పోటీ ..
ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో అనేక మంది పోటీ పడ్డారు.తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు వాడపల్లి దేవాలయానికే అధికంగా తరలివస్తున్నారు.అందుకనే అనతి కాలంలోనే ఈ ఆలయానికి ఎనలేని గుర్తింపు వచ్చింది."ఏడు వారాల వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం" అనే నినాదం భక్తుల్లో బలమైన విశ్వాసాన్ని పొందింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేకమంది ఈ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. దీంతో ఈ చైర్మన్ పదవి పొంది సేవ చేసుకోవడానికి అనేకమంది ప్రముఖులు ఈసారి పోటీపడ్డారు.రాష్ట్రంలో పలువురు కూటమి నాయకులు ఈ చైర్మన్ పదవి కోసం పట్టుపట్టారు. అయితే ఆత్రేయపురంకు చెందిన ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) తెలుగుదేశం పార్టీకి కష్ట సమయంలో అండగా నిలిచారు. ఆర్థికంగానూ కూడా పార్టీకి తన వంతు సేవలు అందించారు. గత ప్రభుత్వంలో అనేక కేసులు కూడా పెట్టించుకున్నారు.ఆ సమయంలోనే పార్టీ అధికారంలోకి వస్తే చైర్మన్ పదవి ఇవ్వడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కష్టపడి ఒప్పించి చైర్మన్ పదవిని ఆయనకి ఎమ్మెల్యే బండారు ఇప్పించగలిగారు. కానీ భవిష్యత్తులో చైర్మన్ పదవి స్థానిక నేతలెవరికీ దక్కదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.ఎందుకంటే ఈ స్వామి వారి ఆలయం ఆ స్థాయి గుర్తింపు సాధిస్తుంది.
ట్రస్ట్ బోర్డు నియమాకాల్లోనూ పోటా పోటీ ...
ఈ దేవస్థానం కమిటీ చైర్మన్ పదవికే కాదు సభ్యులకు కూడా విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు స్వామి వారి దర్శనాలకు సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. దీంతో ఈ దేవస్థానం కమిటీలో మాకు స్థానం కావాలని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు పట్టు పట్టారు. అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవారు అధికంగా ఉన్నందున తమకు అవకాశం ఇవ్వాలని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పట్టపట్టడంతో ఆ నియోజకవర్గం నుండి ఒకరికి అవకాశం ఇచ్చారు. అలాగే ఒంగోలు, కృష్ణా జిల్లా పామర్రు, పశ్చిమగోదావరి ఆచంట, పాలకొల్లు, కాకినాడ జిల్లా పెద్దాపురం లతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరికి ఈ ధర్మకర్తల మండలిలో స్థానం కల్పించ్చారు.ప్రభుత్వ నిబంధనలతో కులాల వారిగా రిజర్వేషన్ల ప్రకారం ఈ నియామకం చేసారు.అలాగే మొత్తం 17 మంది సభ్యుల కమిటీలో చైర్మన్ తో పాటు 14 మంది టీడీపీ కాగా జనసేనకు రెండు, బిజెపి ఒకరికి అవకాశం ఇచ్చారు. అలాగే దేవస్థాన అర్చక విభాగం నుంచి ప్రత్యేక ఆహ్వానతులుగా వాడపల్లి సుందర శేషావతారం ను నియమించారు. మరొక ప్రత్యేక ఆహ్వానతులుగా మత్స్యకార సామాజిక వర్గం నుంచి వానపల్లికి చెందిన మసకపల్లి త్రిమూర్తులను నియమించారు. వీరిద్దరూ ఆ 17 మంది ధర్మకర్త మండల తో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా కొనసాగుతారు.
ప్రమాణ స్వీకారం చేసే పాలక వర్గం
1. ముదునూరి వెంకటరాజు.. చైర్మన్
సభ్యులు..
2.చలుమూరి రాంబాబు(ఆచంట)
3. గంగవరపు పద్మావతి(ఒంగోలు)
4. కాసా చాముండేశ్వరి (కేతరాజుపల్లి) 5.కొల్లుబోయిన శ్రీనివాసరావు(పెద్దాపురం)
6.పెండెం కుమారి(ర్యాలి)
7.పెండ్యాల భవాని(పాలకొల్లు)
8.సలాది నాగేశ్వరరావు(పెదపళ్ల)
9.సరళ సరిత(మోడేకుర్రు)
10.ఏపుగంటి విజయ కుమారి(వాడపల్లి)
11.చింతపల్లి సత్యనారాయణ(మోడుకుర్రు)
12.తమ్మన సాయి ప్రసాద్(కొత్తపేట)
13.ఎల్లమల్లి చంద్రకుమారి(కొత్తపేట)
14.కొండపల్లి రామచంద్రరావు(హైదరాబాదు)
15.సిస్తా సూర్య కుటుంబరావు(ఆత్రేయపురం)
16.దళపర్తి శ్రీ లక్ష్మి(కృష్ణా జిల్లా పామర్రు)
17.గోసాల అప్పలనరస(పాయకరావుపేట)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి