ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ గుడి గురించి , ఆ గుడి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇంద్ర కీలాద్రి గుడి సంబంధించిన దేవాదాయ శాఖ వారు ఇప్పటికే ఈ గుడికి సంబంధించి సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ఆ సోలార్ ప్లాంట్ ద్వారా వారు కరెంటు ను వినియోగించుకోవడం మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా కొంత కరెంటును సరఫరా చేస్తున్నారు.

దానితో ఇంద్ర కీలాద్రి గుడికి సంబంధించి ఎలాంటి కరెంట్ బిల్ ఉండదు అని , వీరి సోలార్ ప్లాంట్ నుండి ప్రభుత్వం కే ఎంతో కొంత కరెంటు వెళ్లే అవకాశం ఉంది అని దానితో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడికి కొంత మేర డబ్బులు వస్తాయి అని చాలామంది అనుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక వార్త పెద్ద సంచలనగా మారింది. ఇంద్ర కీలాద్రి గుడికి సంబంధించిన కరెంటు బిల్లును భారీగా ఉన్నాయి అని , భారీగా కరెంట్ బిల్లు లు ఉండడంతో ఇంద్ర కీలాద్రి గుడికి సంబంధించి కరెంటును తీసేశారు అని ఓ వార్త వైరల్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ గుడికి సంబంధించిన దేవాదాయ శాఖ వారు ఇప్పటికే పలు మార్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రస్తుతం మాకు వస్తున్న కరెంట్ బిల్లులు చాలా తప్పు. వీటిపై సమగ్ర సర్వే నిర్వహించాలి. మేము సోలార్ ప్లాంట్ ద్వారా కరెంటును వినియోగించుకుంటున్నాము. 

ఒక వేళ మేము వినియోగించుకుంటున్న స్థాయి కరెంటు సోలార్ ద్వారా ఉత్పత్తి కాకపోతే ఎంతో కొంత మేర గిడికి కరెంట్ బిల్లు రావాలి. కానీ ఇంత పెద్ద స్థాయిలో కరెంట్ బిల్లు రావడం ఏంటి ..? దీనిపై కచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చర్య నిర్వహించాలి అని ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ గుడి నిర్వాహకులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను కోరినట్లు తెలుస్తుంది. కాకపోతే వారు ఏ మాత్రం పట్టించుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ గుడికి పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడం , దాని వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు గుడికి కరెంట్ కట్ చేశారు అనే వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీని విషయంలో ఎంతో మంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: