టీమిండియా  కెప్టెన్ విరాట్  కోహ్లీ  సతీమణి , ప్రముఖ హీరోయిన్  అనుష్క శర్మ  కు  బీసీసీఐ  సెలెక్టర్లు   టీ కప్పులు అందించారని  మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి.  ప్రపంచ కప్ సమయంలో  ఓ మ్యాచ్ సందర్బంగా  ఓ  సెలక్టర్  అనుష్క శర్మ  టీ కప్పులు  అందించాడు. ఆ సెలక్షన్ కమిటీ  ఓ మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ ...  కోహ్లీ చెప్పినట్లు  సెలక్షన్  కమిటీ నడుచుకుంటుంది. అందులో ఎవరికి సరైన  అర్హత  కూడా  లేదు కనీసం అందులో ఏ ఒక్కరి కూడా 12 టెస్టులు ఆడినా  అనుభవం లేదు. అలాంటి వారిని బీసీసీఐ, సెలెక్టర్లు గా ఎంపిక చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన  ఫరూఖ్ .. దిలీప్ వెంగ్ సర్కార్ లాంటి  దిగ్గజాలు  సెలక్షన్ కమిటీ లో  ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 




ఇక  సెలక్టర్లు తనకు  టీ కప్పులు  అందించారన్న  వ్యాఖ్యలపై  అనుష్క శర్మ స్పందించింది.  మీమధ్య లోకి నన్నెందుకు లాగుతున్నారు. సెలక్టర్లు  టీ  కప్పులు అందించారని చెప్పిన మాట వాస్తవం కాదు.  ఆయన  ఏ ఉద్దేశం తో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు.  కానీ  ప్రపంచ కప్ లో నేను కేవలం ఒక్క మ్యాచ్చేస్టేడియం కి వెళ్లి చూసాను అది కూడా  ఫ్యామిలీ బాక్స్ లో ఉండి చూశాను తప్ప సెలక్టర్ల బాక్స్ లో కాదు. మీకు సెలక్షన్ కమిటీ పైన  ఏమైనా అభ్యంతరాలు ఉంటే   వ్యక్తం చేసుకోండి  కానీ  వాటిని  ద్రువీకరించుకోవడానికి  నా పేరు వాడడం చాలా తప్పు. ఇలాంటి విషయాలు నేను అస్సలు  సహించను అని అనుష్క  ట్విట్టర్  ద్వారా  తన ఆగ్రహాన్నివెళ్లగక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: