స్పిన్  దిగ్గజం  షేన్ వార్న్ తరువాత టెస్టుల్లో  అత్యధిక  వికెట్లు తీసిన నాన్ ఏషియన్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయాన్.   తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో  లయాన్10వికెట్ల తో చెలరేగి  ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు లయాన్ 96టెస్టుల్లో  390వికెట్లు పడగొట్టాడు. ఇక షేన్ వార్న్ 145 మ్యాచ్ ల్లో 708 వికెట్లు పడగొట్టి ఓవరాల్ గా టెస్టుల్లో  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో  రెండో  స్థానం లో  ఉండగా 133మ్యాచ్ ల్లో  800 వికెట్లు  తీసి శ్రీలంక లెజండరీ స్పిన్నర్ మురళీధరన్  అగ్రస్థానం లో వున్నాడు. 
 
ఇక లయాన్ కు ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు  తీయడం  ఇది మూడోసారి. ఇదిలా ఉంటే  న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టు లో 279పరుగుల తేడాతో గెలిచి  ఆస్ట్రేలియా  మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా   ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో  7మ్యాచ్ ల్లో గెలిచి 296పాయింట్ల తో పాయింట్ల పట్టికలో ఆసీస్  రెండో స్థానం లో నిలిచింది.  ఈజాబితాలో 360పాయింట్ల తో భారత్ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీ లో ఇప్పటివరకు  భారత్ 7మ్యాచ్ లు ఆడగా అన్నింట్లో విజయం సాధించి ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: