కీలక సమయం లో ఒత్తిడిని జయించడం ఎలాగో టీమిండియా ను చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే . గతం లో కీలక సమయాల్లో తడబడుతూ అందివచ్చిన విజయావకాశాలను కూడా చేజార్చుకునే అలవాటు ఉన్న భారత్ జట్టు , ఇప్పుడు ఎంత  ఒత్తిడి ఉన్న జయించి విజయలక్ష్యాన్ని చేరుకొని సత్తా చాటుతోంది . భారత్ జట్టు పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన తరువాత ఆటగాళ్ల ప్రవర్తన లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది .

 

ప్రపంచం లో  ఏ జట్టునైనా, అదే దేశం వెళ్లి ఓడించడమే కాకుండా ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న విజయాలను మాత్రం ఒడిసిపట్టుకుంటూ , ఇది పూర్వపు టీమిండియా కాదని యువ ఆటగాళ్లు చాటి చెబుతున్నారు . తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండు టి - ట్వంటీ మ్యాచ్ లలో సూపర్ ఓవర్ లో విజయాలను సాధించడం , భారత్ జట్టు మానసిక స్థైర్యాన్ని తెలియజేస్తోంది . మూడవ టి -ట్వంటీ  మ్యాచ్ లో భారత్ జట్టు సమిష్టిగా రాణించి ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని సమం చేయడంతో , ఫలితం తేలేందుకు సూపర్ ఓవర్ ఆడిన విషయం తెల్సిందే . సూపర్ ఓవర్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ , కెఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు .

 

ఇక నాల్గవ టి -ట్వంటీలోనూ అదే పరిస్థితి పునరావృత్తం అయింది . అయినా భారత్ జట్టు కీలక సమయం లో ఒత్తిడి ని ఉఫ్ ...  మనిపించి, ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది . గతం లో కీలక సమయాల్లో ఒత్తిడి జయించి జట్టును విజయాలబాట నడిపించాలంటే అందరూ  ఆస్ట్రేలియా ను రోల్ మోడల్ గా చూపించగా , ఇప్పుడు ప్రపంచం లో ఎవరైన కోహ్లీ సేన ను చూపించాల్సిన పరిస్థితి నెలకొంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: