ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆట కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది అంటే స్టేడియం ప్రేక్షకులతో నిండి పోతుంది . ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ చూస్తూ  ఉంటారూ. ఫుట్బాల్ ఆట ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆటలో  ఎటునుంచి ఎటు ఆట మలుపులు తిరుగుతుందో ఊహించని విధంగా ఉంటుంది. అయితే ఫుట్బాల్ ఆటలో ఎక్కువగా ఆటగాళ్ళ మధ్య  గొడవలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇలా మైదానంలోనే ఇరు జట్ల క్రీడాకారులు వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఒకరిమీద ఒకరు చేసుకొని కొట్టుకున్న  ఘటనలు కూడా ఉన్నాయి. 

 

 ఈ క్రమంలోనే ఫుట్బాల్ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు లోనీ  ప్లేయర్ పురుషాంగాన్ని కొరికేసాడు ఆటగాడు. అయితే గత ఏడాది నవంబర్లో ఈ ఘటన జరిగినప్పటికీ... ఈ ఘటనపై విచారణ జరిగింది.తాజాగా ఆటగాడిని ఐదేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక బాధిత ఆటగాన్ని  కూడా ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. 2019 నవంబర్ 17న ఫ్రాన్స్ కు చెందిన టెర్విల్లే.. సొట్రిచ్ జట్ల మధ్య సెకండ్ డివిజన్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫుట్బాల్ మ్యాచ్ 1-1 తో సమం కావటంతో డ్రా గా  ముగిసింది. అయితే మ్యాచ్  ముగిసిన అనంతరం కార్ పార్కింగ్ వద్ద ఇరు జట్ల కు చెందిన ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. 

 

 ఈ క్రమంలోనే టెర్విల్లే  జట్టుకు చెందిన మరో ఆటగాడు కలుగ  చేసుకున్నాడు. అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. దీంతో కోపోద్రిక్తులైన సొట్రిచ్   జట్టు ఆటగాడు... సర్ది చెప్పేందుకు  వచ్చిన టెర్విల్లే  జట్టు ఆటగాడు పురుషాంగాన్ని  గట్టిగా కొరికేసాడు. అయితే ఆటగాల్లెవరూ ఊహించని పరిణామం జరగడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక బాధితుడికి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా అతని పురుషాంగానికి ఏకంగా పది కోట్లు పడ్డాయి. అయితే ఈ ఘటనను  తీవ్రంగా తీసుకునీ..  క్రమశిక్షణ కమిటీ గ్రౌండ్లో గొడవపడిన ఇరువురు ఆటగాళ్లకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల విచారణ తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్  విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: