న్యూజిలాండ్ సిరీస్ లో భారత్ జట్టు ఘోర ఓటమికి  జట్టు సారథి విరాట్ కోహ్లీ సమాధానం చెప్పకనే చెప్పాడు . పేలవమైన బౌలింగ్ విభాగం వల్లే సిరీస్ చేజార్చుకున్నట్లు భావిస్తోన్న కోహ్లీ , ఇక పేస్ బౌలింగ్ యూనిట్ పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నాడు . జట్టులో  బుమ్రా మినహా మిగతా పేసర్ల పని అయిపోయిందని కోహ్లీ  పరోక్షంగా   చెప్పుకు వచ్చాడు  .

 

ఇన్నాళ్లు జట్టు భారాన్ని మోసిన  ఇషాంత్ , ఉమేష్ యాదవ్, షమీలు వయస్సు రీత్యా మరెంతోకాలం జట్టుకు సేవలందించే అవకాశాలు లేవన్న కోహ్లీ ,  జట్టు మేనేజ్ మెంట్ ఇకనైనా కురాళ్ళపై దృష్టి పెట్టాలని సూచించాడు . ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా బౌలింగ్ వేసే యువ పేసర్లను గుర్తించాలని అన్నాడు . ఎందుకంటే సీనియర్ల లేనప్పుడు వారి లోటును భర్తీ చేసేవిధంగా యువ ఫాస్ట్ బౌలర్లు ఉండాలని చెప్పాడు . గత రెండేళ్లుగా భారత్ కు విజయాలను అందించింది పేస్ విభాగమేనన్న విషయాన్ని విస్మరించరాదని  అన్నాడు విరాట్.   ప్రస్తుతానికి సైనీ ఒక్కడు గాడిలో పడ్డాడని , ఇక ముగ్గురు, నల్గురు కుర్రాళ్లను ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నాడు .

 

కోహ్లీ ...  ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్ పేరు చెప్పకపోయినప్పటికీ హైదరాబాద్ మీడియం ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ , కేరళ కు చెందిన సందీప్ వారియర్ , మధ్యప్రదేశ్ కు చెందిన అవేశ్ ఖాన్ , పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇషాన్ పోరైల్ లకు రానున్న రోజుల్లో అవకాశాలిచ్చి పరీక్షించాలన్న యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది . ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ , ఉమేష్ యాదవ్ , షమీ లకు తగిన బ్యాక్ ఆప్  బౌలర్లు  లేకపోవడం జట్టు మేనేజ్ మెంట్ ను తీవ్రంగా వేధిస్తున్నట్లు కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: