కరోనా వైరస్.. దీని దెబ్బకి ప్రపంచం మొత్తం విలవిలలాడి పోతుంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో క్రీడా రంగానికి సంబంధించిన అన్ని టోర్నమెంట్ లను నిలిపేశారు. అలాగే మన భారతదేశంలో కూడా ఐపీఎల్ సీజన్ ని వాయిదా వేశారు. అయితే అది తిరిగి జరుపుతారా లేదా అన్న పరిస్థితి నెలకొని ఉంది.

 


అయితే ఇక అసలు విషయానికి వస్తే.. ఆసియా కప్ 2020 టోర్నీ పూర్తిగా రద్దు అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ టోర్నీని నిర్వహించడానికి పాకిస్తాన్ హక్కులు కలిగి ఉంది. అయితే ఆ దేశంలో టోర్నీ నిర్వహిస్తే గనుక టీమిండియాని అక్కడికి పంపమని బిసిసిఐ ఎప్పుడో ప్రకటించింది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బిసిసిఐ మాటల యుద్ధానికి దిగి ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గి uae వేదికగా టోర్నీని నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. 

 


దీనికోసమని సెప్టెంబర్ లో టోర్నీ నిర్వహించేలా షెడ్యూల్ కూడా ప్రాథమికంగా తయారుచేసి విడుదల చేసింది. అయితే పరిస్థితులు సర్దుకోవడం కష్టంగా ఉండటంతో ఈ టోర్నీ జరగడం సందేహమే అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇషాన్ మణి తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: