క్రికెట్ లో బంతి నుంచి స్వింగ్ రావడం కోసం ఉమ్ము లేదా చమట ఉపయోగించడం సర్వసాధారణమే చెప్పాలి. కాకపోతే ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి దెబ్బకు ఇప్పటినుంచి ఇలా చేయాలంటే క్రికెటర్లలో భయం మొదలైందని చెప్పాలి. ఒకవేళ వైరస్ లక్షణాలు ఉన్న క్రికెటర్ బంతిపై ఉమ్మితే మ్యాచ్ లో పాల్గొన్న వారందరికీ కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో క్రికెట్ ప్రారంభమయ్యాక బౌలర్లు, ఫీల్డర్ బంతిని పాలిష్ చేయాలంటే చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఇక ఈ విషయంపై నిషేదాజ్ఞాలు కూడా విధించవచ్చు అనే భావనలో ఉన్నారు అనే చెప్పాలి. 

 

ఉమ్ము లేదా చెమట వాడకుండా నిషేధాలు జారీ అయినట్లు అయితే బంతిని స్వింగ్ కు క్రికెటర్లకు అనుకూలంగా మార్చడం ఎలా అనే ప్రశ్న అందరిలోనూ ఏర్పడుతుంది. 
ఇందుకు ముఖ్య పరిష్కారం బాల్ టాంపరింగ్ అని అధికారికంగా చెయ్యటమే మంచిది అంటూ కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇక సాధారణంగా క్రికెట్లో స్యాండ్ పేపర్ లాంటివి వాడుకొని బంతి ఆకారంలో మార్చే ప్రయత్నాలు నిషేధం అనే చెప్పాలి. 

 


ఇలా రెండు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవెన్ స్మిత్, వార్నర్ క్రాఫ్ట్ ఇలా బాల్ టాంపరింగ్ చేసే విషయంలోనే చాలా వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. ఈ విషయం పై నిషేధం కూడా వీరు ఎదుర్కొన్నారని చెప్పాలి. అంతేకాకుండా క్రికెట్ విషయంలో ఇలాంటి టాంపరింగ్ వివాదాలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రస్తుతం బంతిని స్వింగ్‌ కు అనుకూలంగా మార్చడానికి ఉమ్మును ఉపయోగించడం ప్రమాదం కాబట్టి, అందుకోసం స్యాండ్ పేపర్ లాంటివి లేదా లాలాజలం ఉపయోగపడే ద్రావణం లాంటివి అనుమతించవచ్చని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితికి పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉపయోగించే తెల్ల బంతితో వచ్చిన ఇబ్బందేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: