గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ గ్రెమ్ వాట్సన్ (75) నిన్న అనగా శుక్రవారం నాడు మృతి చెందారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... తన నివాసంలోనే శుక్రవారం నాడు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వాట్సన్ మృతికి సంతాపంగా ఐసిసి క్రికెట్ ఆస్ట్రేలియా తోపాటు పలువురు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు సంతాపం తెలిపారు. అయితే ఈయన ఇప్పుడు జనరేషన్ వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. దీనికి కారణం గ్రీన్ వాట్సన్ 1967 - 1972 మధ్యలో ఆయన ఆస్ట్రేలియా జట్టు తరఫున మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ లతోపాటు, కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడారు.


ఇక ఈయన విక్టోరియా జట్టు తరపున తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించి 1966 -67 లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకుని తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అయితే మెల్బోర్న్ వేదికగా 1971-72 మధ్యలో జరిగిన ఒక మ్యాచ్లో టోనీ గ్రెగ్ అనే బౌలర్ వేసిన బంతి కి వాట్సప్ ముక్కుకు బలంగా తాకడంతో దీంతో అతన్ని ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని అని తెలిపారు. ఆ సంఘటన నుంచి త్వరగా కోలుకునప్పటికీ ఆయన చివరికి కేవలం రెండు టెస్టుల్లో రెండు వన్డేలు మాత్రమే ఆడ గలిగారు.


అయితే తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4674 పరుగులను సాధించాడు అంతేకాకుండా 186 వికెట్లను కూడా తీశాడు. ఈయన విక్టోరియా తరఫున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుండగా మూడు సీజన్ లలో స్పెషల్ సీల్డ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. వాట్సన్ కి కేవలం క్రికెట్ కాకుండా రూల్స్ ఫుట్బాల్ క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉంది. మెల్బోర్న్ జట్టు తరఫున ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్బాల్ మ్యాచ్ లను వాట్సాన్ ఆడారు కూడా. ఈయన మృతి పట్ల ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపల్ తన సంతాపాన్ని వ్యక్తపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: