ప్రస్తుతం ఐపీఎల్ సీజర్ ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్లో అయితే దిగ్గజ  జట్లుగా ఉన్న  చెన్నై ముంబై జట్టులో ఏదో ఒక జట్టు టైటిల్ సాధిస్తుంది అని ప్రేక్షకులకు అంచనాలు ఉండేవి. లేదా మరో రెండు మూడు జట్లపై ఇలా టైటిల్ ఫేవరెట్ జట్లు గా అంచనాలు ఉండేవి. కానీ ఈ సారి మాత్రం ప్రేక్షకుల అంచనాలు తారుమారై పోతున్న విషయం తెలిసిందే. అద్భుతంగా రాణిస్తాయి అనుకున్న జట్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటుంటే... ఎలాంటి అంచనాలు లేని జట్టు సైతం అద్భుతంగా రాణిస్తూ టాప్ ప్లేస్లో నిలుస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఈసారి టైటిల్ గెలవబోయేది  ఏ జట్టు అన్నది ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది.



 ముఖ్యంగా ఈసారి ఐపీఎల్ టైటిల్ యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలుస్తుందనే క్రికెట్ ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే యువ ఆటగాడు అయినప్పటికీ కెప్టెన్సీలో ఎంతో పరిణితి కనబరుస్తూ ఎంతో అద్భుతంగా జట్టును సమతూకం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు శ్రేయాస్ అయ్యర్. ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది  ఐపీఎల్ లో అత్యధిక విజయాలతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక తమకు ఐపీఎల్ సీజన్ లో తిరుగు లేదు అని తమ ఆటతోనే నిరూపిస్తోంది.



 దీంతో ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే  జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ అని క్రికెట్ విశ్లేషకులు  క్రికెట్ అభిమానులు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. గతంలో ఓసారి ఫైనల్కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క అడుగు దూరం లో వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఎలాగైనా టైటిల్ గెలిచి... తమకు అందరి ద్రాక్షల ఊరిస్తున్న టార్గెట్ ను చేధించాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  దృఢసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉన్న జోరు చూస్తే ఇది సాధ్యమయ్యేలా గానే కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: