ఐపీఎల్ పోరు ప్రస్తుత సమయంలో మరింత రసవత్తరంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ లీగ్ దశ ముగింపు వచ్చినప్పటికీ ప్లే ఆఫ్ బెర్తులు దక్కించుకోబోయే  జట్లు  ఏవి అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లే ఆప్  చేరగా. ఇక బెంగళూరు, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆప్ కి చేరడానికి మార్గం ఎప్పుడో సుగమం అయిపోయింది అన్న విషయం తెలిసింది.  ప్లే ఆఫ్  కోసం ప్రస్తుతం నాలుగవ స్థానాన్ని సంపాదించేందుకు అన్ని జట్లు పోటీ పడుతున్నాయి.



 అయితే ఇటీవలే చెన్నై చేతిలో ఓడిపోయిన కోల్కత నైట్రైడర్స్ జట్టు ప్లే ఆఫ్  ఆశలు మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్   గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. కాని  తక్కువగా రన్ రేట్  ఉండడంతో కోల్కత నైట్ రైడర్స్ కి ప్లే ఆఫ్  చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్లే ఆఫ్ ఆశలు  సజీవంగా ఉంచుకుంటూ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతూ ముందంజలో ఉంది కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు. నేడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తో తలపడేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సిద్ధమైంది అనే విషయం తెలిసిందే.


 ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు మరింత చేరువ అవుతుంది. రాజస్థాన్ కి కూడా ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే నేడు జరగబోయే మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే సన్రైజర్స్ కి కలిసొస్తుంది. ఎందుకంటే ఒకవేళ పంజాబ్ ఓడిపోతే సన్రైజర్స్ చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా కు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు దక్కించుకుంటుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో  ఏ జట్టు గెలుస్తుంది అన్నది ప్రస్తుతం సన్రైజర్స్ ఆటగాళ్లలో టెన్షన్ నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: