టీమ్ ఇండియా లో కీలక ఆటగాడు రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొట్టటమే  కాదు ప్రస్తుతం టీమిండియా లో సిక్సర్ల వీరుడిగా డబుల్ సెంచరీలు ధీరుడిగా రోహిత్ శర్మ కు అరుదైన రికార్డులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకసారి బరిలోకి దిగాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ బౌలర్లను ఇబ్బంది పెడుతూ ఉంటాడు రోహిత్ శర్మ. టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం భారత జట్టు దాదాపు తొమ్మిది నెలల తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడేందుకు సిద్ధమయ్యింది. ఇటీవల ఐపీఎల్ టోర్నీలో ఆడిన భారత జట్టు ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది  అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో రోహిత్ శర్మ గాయం బారిన పడడంతో బీసీసీఐ వన్డే టి20 లకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు బీసీసీఐ. ఇక రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం జుట్టుకు ఒక పెద్ద లోటు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఒకరికొకరు క్రీడాస్ఫూర్తిని చాటుకుంటూ.. ఇరు జట్ల లోని ఆటగాళ్లు గురించి గొప్పగా చెబుతున్నారు అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు.


. దిగ్గజ  ఆటగాడు జట్టులో లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద లోటు అని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్. అయితే ఎవరైనా మంచి నాణ్యమైన ఆటగాళ్లతో తలపడాలి అని కోరుకుంటూ ఉంటారని.. అలాంటి ఆటగాడే రోహిత్ శర్మ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియాలో రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ రోహిత్ శర్మ స్థానాన్ని మయాంక్ అగర్వాల్ భర్తీ చేయగలడు అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: