అయితే ఈ మధ్య కాలంలో అయితే గౌతం గంభీర్ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాడు. ప్రస్తుతం క్రికెట్ లో ఎలాంటి తప్పు జరిగినా కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శలకు సైతం దిగుతున్నాడు గౌతమ్ గంభీర్. ఇక ఇటీవలే ఐపీఎల్లో జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ల లేక ఇబ్బందులు పడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారిపోయింది. గెలవాల్సిన మ్యాచులో కూడా కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఓడిపోతుంది.
తాజాగా దీనిపై స్పందించిన గౌతం గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లాంటి కెప్టెన్ ను ఇప్పటి వరకు తాను చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. కోహ్లీ ని 5 పరుగులకు.. రజత్ పాటిదార్ ను కేవలం ఒక్క పరుగుకే అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తిని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సరిగా వినియోగించుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అసలు అలాంటి కెప్టెన్ ను నా జీవితంలో చూడలేదు అంటూ వ్యాఖ్యానించాడు. వరుణ్ చక్రవర్తి మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఇక ఆ తర్వాత అతనికి స్పెల్ ఇవ్వాల్సింది పోయి అతని పక్కన పెట్టి మిగతా వాళ్లకి బౌలింగ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి