ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.  ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా జట్టు.  ఇక ఫైనల్ మ్యాచ్లో గెలిచి విశ్వవిజేతగా నిలుపుస్తుంది అనుకున్నప్పటికీ చివరకు నిరాశ పరిచింది. వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇరవై రోజుల పాటు టీమిండియా బ్రేక్ తీసుకుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది  ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాక్టీస్ మొదలు పెట్టింది.


 ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి అందరినీ నిరాశపర్చిన టీమిండియా జట్టు టెస్టు సిరీస్లో మాత్రం తప్పనిసరిగా గెలిచి మళ్ళీ భారత క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాలి అనుకుంటుంది. ఈ క్రమంలోనే అందరూ ఆటగాళ్ళు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని బ్యాడ్ న్యూస్ అందింది  జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవలే టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు అన్న విషయం తెలుస్తుంది. బెన్ స్టోక్స్ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  కేవలం బ్యాట్ తో మాత్రమే కాదు బంతితో కూడా కీలక సమయంలో విజృంభిస్తు అంటాడు బెన్ స్టోక్స్.



 అయితే ఇటీవలే  చేతి వేలు గాయం నుంచి కోలుకుంటున్న బెన్ స్టోక్స్ అటు మానసికంగా కూడా మరింత దృఢంగా మారేందుకు కొంత బ్రేక్ తీసుకున్నాడు అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాదు టీమిండియాతో జరగబోయే టెస్టు సిరీస్కు బెన్ స్టోక్స్ జట్టుతో అందుబాటులో ఉండడు అన్న విషయాన్ని తెలిపింది ఇది టీమిండియాకు ఒక శుభవార్త అనే చెప్పాలి.  ఇక బెన్ స్టోక్స్ లాంటి కీలక ఆటగాడు ఇంగ్లాండ్ జట్టుకు దూరం కావడంతో ఇది అటు టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చే అంశం. మరి ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగితేలుతున్న టీమిండియా జట్టు ఇంగ్లాండ్ తో ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ లో ఎలా రాణించ బోతుంది  అన్నది ఆసక్తికరంగా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: