ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోహ్లీ కెప్టెన్గా తప్పుకుంటున్నాను అంటూ ప్రకటన చేయడం చాలా సంచలనంగా  మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ వస్తున్నప్పటికీ ఎప్పుడు దానిపై స్పందించలేదు కోహ్లీ. కానీ ఎవరు ఊహించని విధంగా ఇటీవల  తాను టి 20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టి20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలనుంచి వైదొలుగుతా అంటూ తెలిపాడు. అయితే కోహ్లీ  తీసుకుని నిర్ణయం  అందరికీ షాక్ కి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై బీసిసిఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ స్పందించాడు.


 విరాట్ కోహ్లీ  కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత తాను ఆశ్చర్యపోయాను అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ పై భారత క్రికెట్ బోర్డు ఎలాంటి ఒత్తిడి చేయలేదని కెప్టెన్సీ వదులుకోవడం కేవలం కోహ్లీ సొంతంగానే నిర్ణయం  తీసుకున్నాడు  మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు సౌరవ్ గంగూలీ. సలాం క్రికెట్ 2021లో  మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాన్ని తాను అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియా లాంటి దేశాన్ని మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం పాటు నడిపించడం అంటే అంత సులభమైన విషయం కాదని.. గతంలో తాను కూడా కెప్టెన్సీ చేశాను కాబట్టి ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.


 తాను ఆరు సంవత్సరాలు టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా వ్యవహరించా.. కెప్టెన్సీ అన్నది బయట నుంచి చూడడానికి బాగా కనిపిస్తోంది అందరి ఆటగాళ్ళ నుంచి రెస్పెక్ట్ కూడా లభిస్తుంది. కానీ లోలోపల మాత్రం ఊహించని అంత ఒత్తిడి ఉంటుంది.అది ఎవరికైనా  అంతే ఉంటుంది. సచిన్, గంగూలీ, ధోని ఇలా ఎవరు కెప్టెన్ గా ఉన్న  అదే ఒత్తిడి ఉంటుంది. దీనికి  కోహ్లీ అతీతుడు కాదు కోహ్లీ కూడా మన లాంటి మనిషి యంత్రం కాదు అందుకే పనిభారాన్ని తట్టుకోలేక తాను ఆట పై దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో టి20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పాలని అనుకున్నాడేమో అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: