టీ20 ప్రపంచకప్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఓ సారి జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ఈ సారి మాత్రం ఐదు సంవ‌త్స‌రాల సుధీర్ఘ మైన గ్యాప్ తో జ‌రుగుతోంది. 2016 లో చివ‌రి సారిగా భార‌త్‌లో ఈ టోర్నీ జ‌రిగింది. అయితే అప్పుడు వెస్టిండిస్ విజేత గా నిలిచింది. ఇక ఇప్పుడు కూడా ఈ టోర్న‌మెంట్ భార‌త్ లోనే జ‌ర‌గాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణం గా యూఏఈ , దుబాయ్ లో ఈ టోర్నీ జ‌రుగుతుంది. ఇక అర్హ‌త మ్యాచ్ లు ఇప్ప‌టికే ముగిశాయి. ఈ రోజు నుంచి సూప‌ర్ -12 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఈ టోర్నీ దుబాయ్‌లో జ‌రుగుతున్నా ఆతిథ్య హ‌క్కులు అన్నీ భార‌త్ ద‌గ్గ‌రే ఉన్నాయి.

టోర్నీ జ‌రిగేది ఇలా...
మొత్తం 33 మ్యాచ్‌లు సూప‌ర్ - 12 లో జ‌రుగుతాయి. రెండు గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపులో ఆరు జ‌ట్లు ఉంటాయి. ఈ గ్రూప్‌లో ఉన్న ఆరు జ‌ట్ల‌లో నాలుగు జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధిచాయి. రెండు జ‌ట్లు మాత్రం క్వాలీఫ‌యింగ్ మ్యాచ్ లు ఆడి అర్హ‌త సాధించాయి. అర్హ‌త మ్యాచ్ ల నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్‌, నమీబియా జట్లు గ్రూప్‌ 1, గ్రూప్‌ 2లో యాడ్ అయ్యాయి. ఒక్కో గ్రూప్ లో ప్ర‌తి జ‌ట్టు ఐదేసి మ్యాచ్ లు ఆడుతుంది.

ఒక్కో గ్రూప్ నుంచి టాప్ - 2 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్ కు అర్హ‌త సాధిస్తాయి. ఆ త‌ర్వాత ఫైనల్ మ్యాచ్ జ‌రుగుతుంది. మొత్తం 12 జ‌ట్లు రంగంలో ఉన్నా టోర్నీ ఫేవ‌రెట్లు గా నాలుగు జ‌ట్లే క‌ప్ రేసులో ముందున్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్‌పను ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భార‌త్ గెలుచు కుంది. ఆ త‌ర్వాత భార‌త్ కు ఒక్క సారి కూడా క‌ప్ ద‌క్క‌లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: