ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. పేరుకు జెంటిల్మెన్ గేమ్ అయినా ఇండియా పాక్ మ్యాచ్ అంటే అదో యుద్ధం లా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు గా రెండు జట్లు తలపడతాయి. ఇది చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులంతా  టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పుడు అలాంటి హై వోల్టేజ్ గేమ్ రెడీ అయిపోయింది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు సర్వం సిద్ధం అయిపోయింది. భారత్ పాక్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ. గేమ్ లో బంతి బంతికి మారే ఆధిపత్యం. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. బ్లాక్ బాస్టర్ వార్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ వెయిటింగ్. జెంటిల్మెన్ గేమ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను చూడాలి. క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ మ్యాచ్ ను చూస్తే వెర్రెక్కి పోతారు.

అందుకే ఎప్పుడూ వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు పోటాపోటీగా జరిగిన ఇండియా పాక్ మధ్య జరిగే మ్యాచ్ చూస్తేనే మజా వస్తుంది. ఇప్పుడు అలాంటి కిక్కిచ్చే గేమ్ కు అంతా రెడీ అయింది. 2021 t20 వరల్డ్ కప్ లో లాంగ్ గ్యాప్ తర్వాత భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఓకే గ్రూపులో ఉన్న దాయాది  దేశాలు దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ కు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ మ్యాచ్ ను లైవ్లో చూసేందుకు కొందరు ఏకంగా దుబాయ్ కే చేరుకున్నారు. మరికొందరు ఇంట్లోనే ఆ కిక్కు ను  ఆస్వాధించేందుకు సిద్ధమయ్యారు. 2007 t20 ప్రపంచ కప్  జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావస్తోంది. అప్పటి వరల్డ్ కప్ లో ఆడిన ఆటగాళ్ల లో ఇరు జట్ల నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ ఉంటే పాకిస్తాన్ నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ కు లు మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న టోర్నీలో  బరిలోకి దిగేది 12 జట్లు అయినా, టైటిల్ ఫేవరెట్ లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న భారత్ మంచి ఊపు మీద కనిపిస్తుంది. 2009లో టైటిల్ సాధించిన మూడో ర్యాంకర్ పాకిస్తాన్ పటిష్టంగానే ఉంది. భారత్ తో పాటు వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , పాక్ కు కూడా కప్పును గెలుచుకునే సత్తా ఉంది. టోర్నీలో విన్నర్ ఎవరన్న విషయం కన్నా భారత్,పాక్ మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: