పురుషుల టి20 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు టి-20 ప్రపంచకప్ విజేతగా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే 20 ప్రపంచకప్ ప్రారంభ మైన పద్నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఈ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవడం గమనార్హం. ప్రతిసారి ఆస్ట్రేలియా జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి చిన్నపాటి తడబాటు తో వెనుదిరగడం లాంటివి జరుగుతూ ఉంది. కానీ ఈ సారి మాత్రం జట్టు సమిష్టిగా కృషి చేయడంతో ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.


 అయితే దశాబ్దాల కల నెరవేరడంతో ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. మ్యాచ్ గెలిచిన వెంటనే ఆటగాళ్లందరూ మైదానంలోకి చేరుకొని ఒకరినొకరు హత్తుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సంబరాల్లో మునిగిపోయారు. అయితేఇలా గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లుచేసుకున్న సెలబ్రేషన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఏకంగా కాలి బూటులో బీరు పోసుకొని తాగారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది



 అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా బూటులో బీర్ పోసుకొని తాగడానికి ఒక పెద్ద కారణమే ఉందట. పాత ఆచారాన్ని క్రికెట్ అభిమానులకు ఆటగాళ్లు పరిచయం చేసినట్లు తెలుస్తోంది.. బూటులో బీర్ పోసుకుని తాగే ఆచారం 18వ శతాబ్దంలో జర్మనీ లో మొదలై తర్వాత ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అయ్యిందట  ఇక దీని షూయి అని పిలుస్తారట. అయితే ఇటీవలే ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్ షూయి ఆచరణలో భాగంగా పొడియం మీదా అందరి ముందు షూ లో బీర్ పోసుకుని తాగి  అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అప్పట్నుంచి చాలా మంది ఆటగాళ్లు ఇది ప్రయత్నిస్తున్నారు. విజయానికి ప్రతీకగా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారట. అయితే బ్యాక్టీరియా కు కేంద్ర బిందువైన షూ లో బీరు తాగడం మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: