ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ల విజృంభ‌ణ కొన‌సాగిస్తోంది. ఈసారి కూడా అనేక రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. క్రీడా రంగంపై ప్ర‌భావం చూపిస్తూ ప‌లు టోర్నిల భ‌విత‌వ్యాన్ని కూడా ప్ర‌శ్నార్థ‌కం చేస్తుంది. తాజాగా ఐసీసీ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేకెత్తింది. అయితే భార‌త జట్టులోనే ఏకంగా ఆరుగురు ఆట‌గాళ్ల‌కు కొవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ కావ‌డం విశేషం. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన టీమిండియా ఆట‌గాళ్ల జాబితాలో భార‌త కెప్టెన్‌, వైస్ కెప్టెన్ కూడా ఉండ‌టం  ఆందోళ‌న కలిగిస్తున్న‌ది. భార‌త కెప్టెన్ య‌శ్‌ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ ర‌షిద్‌తో పాటు మ‌రొక న‌లుగురు ఆట‌గాళ్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింద‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆరాధ్య యాద‌వ్‌, వాసువ‌ల్స్ మ‌న‌వ్ ప‌ర‌బ్, సిద్ధార్థ్ యాద‌వ్‌కు కొవిడ్ సోకింద‌ని ఓ అధికారి మీడియాకు తెలిపారు.

కొవిడ్ సోకిన భార‌త ఆట‌గాళ్లు అంద‌రూ ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఈనెల 17న న‌లుగురు ఆట‌గాళ్ల‌కు క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయిన‌ది. వారితో ద‌గ్గ‌ర‌గా మెలిగిన కొంద‌రికీ ప‌రీక్ష‌లు చేయించ‌గా..  కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌లకు కూడా పాజిటివ్‌గా వ‌చ్చింది. అండర్-19 ప్రపంచకప్‌ గ్రూప్-బిలో ఉన్న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జ‌రిగిన‌ది. అయితే కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌తో పాటు మ‌రొక న‌లుగురు ఆట‌గాళ్లు అందుబాటులో లేరు. అయిన‌ప్ప‌టికీ ట్రినిటాడ్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నిషాంత్ సింధు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ స‌హా కీల‌క ఆట‌గాళ్లు లేక‌పోయిన‌ప్ప‌టికీ.. భార‌త్ అద్భుత‌మైన ఇన్నింగ్ ఆడింది. 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 307 ప‌రుగుల భారీస్కోర్ చేసింది.  

భారత ఓపెనర్లు అంగ్ క్రిష్ రఘువంశి (79), హరనూర్ సింగ్ (88) వికెట్ పడకుండా 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్ప‌డం.. ఆ తర్వాత రాజ్ భవా (42) ఆచితూచి ఆడాడు.  చివరిలో కెప్టెన్ నిషాంత్ (36), రాజ్‌వర్ధన్ (39) సిక్సర్లతో విరుచుకుపడి భారీ స్కోర్ చేసారు. అయితే తొలి మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి శుభారంభం చేసింది. శ‌నివారం యుగాండాతో త‌ల‌ప‌డ‌నున్న‌ది. గ్రూప్‌-బీలో భార‌త్‌కు ఇదే ఆఖ‌రు మ్యాచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: