టీమ్ ఇండియా లో తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు అన్నదానిపై గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ తర్వాత అంత సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించగల ఆటగాడు ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇక ఆ తర్వాత రోహిత్ శర్మనే అంతటి సమర్ధుడు అని అనుకుంటున్నారు. కానీ వయస్సు  ఫిట్ నెస్ దృశ్య రోహిత్ శర్మ కంటే యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పగించడం  మేలు అనే చర్చ కూడా తెర మీదికి వస్తుంది. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ రిషబ్ పంత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


 ఇకపోతే ఇటీవలే వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ అందుకున్న కేఎల్ రాహుల్ సౌత్ఆఫ్రికా పర్యటనలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ఒక టెస్ట్ మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో వన్డే సిరీస్ను కూడా కెప్టెన్గా ముందుకు నడిపించాడు కె.ఎల్.రాహుల్. కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించిన అన్ని మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఇక సారథిగా రాహుల్ పూర్తిగా వైఫల్యం చెందడం తో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని మొట్టమొదటిసారి టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్లో వైట్వాష్ అయి అప్రతిష్ఠ మూట కట్టుకుంది.


 అయితే ఇటీవలే కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ గురించి బీసీసీఐ అధికారి ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసిన ట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.టెస్ట్ కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్ కు ఉన్న అవకాశాలు చెప్పమని మీడియా కోరగా.. అసలు కె.ఎల్.రాహుల్ లో ఏ కోశాన్నైనా  మీకు కెప్టెన్ కనిపిస్తున్నాడా అంటూ ఎదురు ప్రశ్నించారట బీసీసీఐ అధికారి ఒకరు. ఇక బిసిసిఐ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అసలు కెప్టెన్సీ రేసులో కె.ఎల్.రాహుల్ ఉన్నాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇక మరికొన్ని రోజుల్లో టెస్టు కెప్టెన్గా బిసిసిఐ ఎవరిని నియమించ పోతుంది అన్నది క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: