మిథాలీ రాజ్.. ఈ పేరు భారత క్రికెట్లో ఒక ప్రభంజనం. కేవలం పురుషుల క్రికెట్ కి మాత్రమేప్రేక్షకుల ఆదరణ ఉన్న సమయంలో తన అద్భుతమైన ప్రతిభతో అందరి చూపులూ మహిళా క్రికెట్ వైపుకు తీసుకురావడంలో మిథాలీ రాజ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ క్రికెట్ కు సాధ్యం కాని రీతిలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది మిథాలీ రాజ్.  అందరూ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో మిథాలీ రాజ్ మాత్రం ఇంకా 39 ఏళ్ల వయసులో కూడా  యువ ప్లేయర్ లకు సైతం సాధ్యం కాని రీతిలో అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతోంది.



 ప్రస్తుతం వన్డే ఫార్మాట్ కి కెప్టెన్గా కొనసాగుతోంది మిథాలీ రాజ్. ఒకవైపు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడమే కాదు మరోవైపు జట్టులో కీలక ప్లేయర్గా అదరగొడుతుంది. ఇక భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ లాగానే  భారత మహిళా క్రికెట్ లో దశాబ్దాలకు పైగా దేశానికి ప్రస్థానం కొనసాగించిన ఏకైక క్రికెటర్ గా కొనసాగుతుంది మిథాలీ రాజ్. చివరకు తన అద్భుతమైన ప్రదర్శన తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది అనే చెప్పాలి. ఇక 39 ఏళ్ల వయసులో కూడా ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది ఈ సీనియర్ క్రికెటర్.



 ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.. దాదాపు తనకంటే 21 ఏళ్లు చిన్నదైన రీచా ఘోష్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న మిథాలీ రాజ్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నాలుగేళ్ల సమయానికి రీఛా ఘోష్ జన్మించింది. అందుకే వీరిద్దరి మధ్య 21 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అంతేకాకుండా కివీస్ జట్టు పై అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్గా కూడా రికార్డు సృష్టించింది. ధోని కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: