టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవలి శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తన కెరీర్లో మైలురాయిలా 100 టెస్ట్ మ్యాచ్ ఆడాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నప్పటికీ అందరికీ నిరాశ ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్ లో 45 పరుగులు చేసి వికెట్ చేజార్చుకున్న  విరాట్ కోహ్లీ ఇక రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం మిగతా పరుగులు చేసి సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు.


 ఎవరూ ఊహించని రీతిలో మొదటి ఇన్నింగ్స్ లో నే 574 పరుగులు చేసింది ఇండియా. ఇక ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్ లాలీ కూడా శ్రీలంక జట్టు ఇండియా స్కోర్ ని బీట్ చేయలేక పోయింది. దీంతో ఒక ఇన్నింగ్స్ తో పాటు 222 పరుగుల తేడాతో విరాట్ కోహ్లీ కి 100 టెస్టులో టీమిండియా కి మరుపురాని విజయం అందింది. దీంతో కోహ్లీ సెంచరీ చేయలేదు అన్న కాస్త నిరాశ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ కి 100 వ టెస్ట్ ఎంతో అద్భుతమైన విజయం గా మిగిలిపోయింది అంటూ అందరూ సంతోషపడి పోయారు.



 అయితే ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక దివ్యాంగుడు అయినా అభిమానికి ఎప్పటికీ మరిచిపోలేని ఒక బహుమతి ఇచ్చాడు. ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత ఆటగాళ్లు అందరూ కూడా బస్సులో వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ధరం వీర్ పాల్ అనే విరాట్ కోహ్లీ అభిమాని కోహ్లీ తనతో మాట్లాడటం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే  కోహ్లీ అంటూ గట్టిగా పిలిచాడు. అయితే ఇక ఈ ఆ విషయాన్ని గ్రహించిన విరాట్ కోహ్లీ వెంటనే అక్కడకు చేరుకుని తన జర్సీ నీ అతనికి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోని అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు 100వ టెస్ట్ సందర్భంగా నాకు ఒక జెర్సీ ఇచ్చాడు అని పేర్కొన్నాడు. ఇది చూసిన తర్వాత విరాట్ కోహ్లీచేసిన పనికి అభిమానులు గర్వపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: