ఈ ఏడాది ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులు ఆడిన గుజరాత్ జట్టు 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది గుజరాత్ జట్టు. మొన్నటి వరకు ఆల్రౌండర్గా మాత్రమే ప్రేక్షకులను మెప్పించిన హార్దిక్ పాండ్యా ఇక ఇప్పుడు ఒక సమర్థవంతమైన కెప్టెన్గా కూడా తనను తాను నిరూపించుకున్నాడు.


 ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గుజరాత్ టైటాన్స్ విషయంలో ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం జరుగుతు వస్తుంది.  ఇప్పుడు వరకు గుజరాత్ టైటాన్స్ గెలిచిన అన్ని మ్యాచులో కూడా ఫలితం చివరి మ్యాచ్లో తేలిందే కావడం గమనార్హం. చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠభరితంగా సాగి ఇక చివర్లో ఎవరో ఒక ఆటగాడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్కు విజయం వరించింది. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఇటీవలే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా స్పందిస్తూ సరదాగా కామెంట్ చేశాడు.


 డ్రెస్సింగ్ రూమ్ లో నేను మిగతా ఆటగాళ్లు అందరితో ఎప్పుడు ఒక జోక్ చేస్తుంటాను..  మీరంతా మంచి ఆటగాళ్లు.. మీరు గెలవడానికి సహాయం చేస్తాను అంటూ దేవుడు నాతో చెబుతూ ఉంటాడు అని ఇక మా జట్టు ఆటగాళ్లతో అంటూ ఉంటాను.  నిజంగానే తరచూ ఇలాగే జరుగుతూ ఉంది. దీంతో మేం నాకౌట్ చేరుకునే సరికి ఆ అదృష్టం కలిసి రాదేమో అని భయమేస్తుంది. మా జట్టులో ఎప్పుడూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆటగాళ్లకు సరైన మద్దతు లభిస్తుందా లేదా అనేది తరచూ చూసుకుంటాం. ఇక నేను బౌలింగ్ చేయాలా వద్దా అన్నది కూడా జట్టు అవసరాలను బట్టి ఉంటుంది. ఇక జట్టులోని ఆటగాళ్లు అందరూ ఎంతో ప్రాక్టికల్ గా ఉంటారు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో వున్నారు అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl