ఇటీవలే పంజాబ్ కింగ్స్  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితం గా జరిగిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. గత కొంత కాలం నుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించగలదా అని ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ విజయం సాధించడం కాదు ఘన విజయాన్ని అందుకుంది పంజాబ్.


 ఇక మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఇక జట్టులోని ప్రతి బ్యాట్స్మన్ కూడా చెలరేగి బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారూ. ఈ క్రమంలోనే ఏకంగా 50 కి పైగా పరుగులు తేడాతో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ జట్టు. మంచి దూకుడు మీద ఉన్న బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే బెంగళూరు జట్టులో కీలక బౌలర్ గా ఎప్పుడు పొదుపుగా బౌలింగ్ చేసే  గా హేజిల్ వుడ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చేశాడు. ఇక మరోవైపు మహమ్మద్ సిరాజ్ సైతం కేవలం రెండు ఓవర్లు వేసి 36 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి సెంచరీ కొట్టేసారు అంటూ విమర్శలు చేస్తున్నారు..


210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసింది. కీలక మైన బ్యాట్స్మెన్లు  తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కేవలం నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl