ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా సత్తా చాటారు. ఇక ఇలా ప్రతిభతో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లతో అటు తెలుగుతేజం తిలక్ వర్మ కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ తిలక్ వర్మ పై నమ్మకం ఉంచి 1.7 కోట్లు వెచ్చించి మరీ అతని కొనుగోలు చేసింది. దీంతో అతను బాగా రాణించాలని తెలుగు ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి.


 అయితే ఇక ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ బ్యాటింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఒకవైపు ముంబై ఇండియన్స్ వరుసగా ఓటమి పాలు అవుతున్నా తిలక్ వర్మ మాత్రం ఎక్కడా తడబాటుకు గురికాకుండా అన్నీ మ్యాచ్ లలో మంచి పరుగులు చేశాడు  ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టు క్యాంపు లో చేరిన తర్వాత తాను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాను అన్న విషయాలను ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  తాను సచిన్ టెండూల్కర్, జయవర్ధనే, జహీర్ ఖాన్,రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లను టీవీలో చూడటం తప్ప ఎప్పుడూ కలవలేదు.


 అయితే ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు క్యాంపులో చేరినప్పుడు అందరిని కలిసి హోటల్లో ఒకే దగ్గర మొదటి సారి చూడటం తో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేరుగా వారితో వెళ్లి మాట్లాడటానికి ధైర్యం కూడా సరిపోలేదు. ఇక ఆ తర్వాత జరిగిన జట్టు సమావేశంలో ఇక సీనియర్ క్రికెటర్లు అందరూ కూడా పాల్గొన్నారు. అదే సమయంలో నాతో కూడా మాట్లాడారు. దీంతో భయం మొత్తం పోయింది. ఇక మైదానంలో ఆడే టప్పుడు కూడా సీనియర్ క్రికెటర్లు ఎంతగానో అండగా నిలిచారు. ఏ బౌలర్ ను ఏ మైదానంలో ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని సచిన్ జయవర్ధనే నేర్పించారు. వారు ఇచ్చిన సూచనలతో నా బ్యాటింగ్ మరింత మెరుగు పడింది అంటూ చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: