భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్టుగా పేరు సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా గత కొంత కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతను టీమిండియాకు దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్ల పోటీ పెరిగి పోవడం ఇక ఒక్కసారి అవకాశం వచ్చినా కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ మంచి ప్రదర్శన చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ గా ఉన్న చటేశ్వర్ పుజారాకు మళ్లీ జట్టులో చోటు దక్కడం కష్టమే అని అందరూ అనుకున్నారు.


 ఒకవేళ చటేశ్వర్ పుజారా మళ్లీ మునుపటిలా ఫామ్ అందుకున్న అతన్ని జట్టులోకి తీసుకుంటారు  అన్న గ్యారెంటీ  మాత్రం లేదు అని భావించారు. ఇలాంటి సమయంలోనే ఇటీవల ఇంగ్లాండ్లో కౌంటీలలో ఆడిన చటేశ్వర్ పుజారా వరుసగా మ్యాచులో సెంచరీ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఛటేశ్వర్ పుజారా టీమిండియా సెలెక్టర్లు చూపులు ఆకర్షించాడు అని చెప్పాలి. ఇలా పూజారా మళ్లీ జట్టులోకి రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రదర్శనతో పునరాగమనం చేశాడు. ఇంగ్లాండ్తో టీమిండియా ఆడబోయే 5 టెస్ట్ కోసం చటేశ్వర్ పుజారా ను జట్టులోకి తీసుకుంది టీమ్ ఇండియా యాజమాన్యం.


 ఇక ఇదే విషయంపై ఇటీవలే టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో విఫలమైన తర్వాత చటేశ్వర్ పుజారా మళ్ళీ జట్టులోకి రావడం కష్టం అని అందరూ భావించారు అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. కానీ అతడు కౌంటీలో బాగా ఆడి జట్టులో చోటు సంపాదించడం నమ్మశక్యంగా లేదు అంటూ తెలిపాడు. క్రికెట్ పట్ల అటు చతేశ్వర్ పూజారా లో కమిట్మెంట్ కనిపిస్తుంది అంటూ తెలిపాడు.. ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం మంచి పరిణామమని తెలిపాడు ఎమ్మెస్కే ప్రసాద్. అతడు మంచి బౌలర్ గా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: