ఐపిఎల్ సీజన్ 15 లో ఇక చివరి రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ కు చేరుకున్న 4 జట్లలో ఒకటి నిన్న జరిగిన ఎలిమినేటర్ లో టోర్నీ నుండి నిష్క్రమించింది. నిన్న బెంగళూర్ మరియు లక్నో జట్ల మధ్యన కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో లక్నో పై బెంగళూర్ ఘన విజయం సాధించి క్వాలిఫైయర్ 2 కు  అర్హత సాధించింది. నిన్న ముఖ్యమైన మ్యాచ్ లో రాహుల్ సేన విఫలం అయ్యి టోర్నీ నుండి తప్పుకుంది. దీనితో కీలక మ్యాచ్ లో ముంబై సాధించిన విజయానికి ఫలితం దక్కింది. కాగా ఇప్పుడు బెంగళూర్ రేపు జరగబోయే క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది.

కానీ గుజరాత్ తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ లో చిన్న చిన్న తప్పిదాలు చేసి ఓటమిని పొందిన రాజస్థాన్ ఈ సారి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే ఈ సారి కూడా అదే పొరపాట్లు రిపీట్ చేస్తే  చేతుల వరకు వచ్చిన ట్రోఫీని పోగొట్టుకున్నట్లే అవుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గేమ్ ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

* విజయం దక్కాలంటే ముందుగా శాంసన్ టాస్ గెలవాలి. అయితే టాస్ గెలవడం లేదా కోలోవడం ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి గెలవాలని కోరుకోగలము.

* ఫీల్డింగ్ వస్తే... బెంగుళూరును 180 పరుగుల లోపు కట్టడి చెయ్యాలి. అంతే కాకుండా బౌలింగ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం చేయించాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ మరియు మెక్ కాయ్ ల ఖాతాను 15 వర్ల లోపే పూర్తి చేయించాలి. ఎందులకంటే స్పిన్ ను చివర్లో వేయించడం అంత మంచిది కాదు. ఇక  మెక్ కాయ్ కూడా కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోలేడు. అందుకే ఇతనికి ముందుగానే ఓవర్లను ఇచ్చేయాలి.

* ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే... బట్లర్ మరోసారి చెలరేగాల్సి ఉంది.. ఇక శాంసన్ కనీసం 15  ఓవర్ల వరకు అయినా నిలబడి జట్టుకు మంచి టార్గెట్ ను అందించాలి.

* ఇక కెప్టెన్ గా సంజు శాంసన్ చాలా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. కీలక సమయంలో ప్రసిద్ధ కృష్ణ తడబడుతున్నాడు. ఎప్పుడైనా చివరి ఓవర్లలో లెంగ్త్ యార్కర్ లు వేస్తే బ్యాట్స్మన్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతాడు. ఈ లాజిక్ మిస్ అయి మొన్న గుజరాత్ తో ఓడింది.

* బెంగుళూరు జట్టులో మాక్స్ వెల్, దినేష్ కార్తీక్ లను కట్టడి చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అలాగే బెంగళూర్ బౌలింగ్ లో హాజిల్ వుడ్ చాలా డేంజరస్... స్లోవర్ బంతులేసి వికెట్లను తీయడానికి ట్రై చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: