ఒకప్పుడు క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాజీ ఆటగాళ్లు గా మారిపోయిన వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ కు సంబంధించి తమ విశ్లేషణలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అయితే భారత క్రికెట్ లో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా టోర్నీ ముగిసిన తర్వాత ఇక మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ బెస్ట్ ఎలవెన్ జట్టు ఏంటి అన్న విషయాన్ని ప్రకటిస్తున్నారు.  వారు ప్రకటించిన జట్టులో వారికి నచ్చిన అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.



 ఇలా మాజీ ఆటగాళ్లు అందరూ కూడా తమ బెస్ట్  ఎలవెన్ జట్టును ప్రకటించడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్ గా కొనసాగుతూనే ఉంది. అందుకే అందరూ ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో తమ బెస్ట్ ఎలెవెన్ జట్టును పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే  కొంతమంది మాజీ ప్లేయర్స్ ఇలాంటివి పోస్ట్ చేయగా.. ఇక ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం తన బెస్ట్ ఎలవెన్ టీమ్ ను ప్రకటించాడు. ఈ క్రమంలోనే తాను ఎంచుకున్న బెస్ట్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ను నియమించడం గమనార్హం.


 ఇక ఈ సీజన్లో 4 సెంచరీలు కొట్టి మొత్తంగా 863 పరుగులు చేసిన బట్లర్  పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్  లను తన జట్టు ఓపెనర్ లుగా ఎంచుకున్నాడు. ఇక మిడిలార్డర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్,  లివింగ్ స్టోన్, దినేష్ కార్తీక్ లను తీసుకున్నాడు. బౌలర్ లుగా  షమి, రషీద్ ఖాన్, జస్ప్రిత్ బూమ్రా  లను ఎంపిక చేశాడు. అయితే సచిన్ ప్రకటించిన జట్టులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బెంగళూరు మాజీ కెప్టెన్ కోహ్లి లకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: