సాధారణంగా ప్రేక్షకులకు అంతర్జాతీయ క్రికెట్ కంటే గల్లీ క్రికెట్ గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. అయితే గల్లీ క్రికెట్ లో ప్రత్యర్థి జట్టు లో ఎవరైనా ఆటగాడు తక్కువ అయితే ఏకంగా మన జట్టు లో నుంచి ఒక ఆటగాడిని ప్రత్యర్థి   జట్టులో ఆడించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి గల్లీ క్రికెట్ లో జరుగుతాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో అస్సలు జరగవు అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. లిస్టర్ షైర్ టీమిండియా ల మధ్య ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ వార్మప్ మ్యాచ్లో టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా రెండు జట్ల తరపున బ్యాటింగ్ చేయడానికి రావడం ఆసక్తికరంగా మారిపోయింది.


 మొదట లిస్టర్ షైర్ కు ప్రాతినిధ్యం వహించిన చటేశ్వర్ పుజారా తొలి ఇన్నింగ్స్ లో షమీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మహమ్మద్ షమినీ ఎదుర్కోవడం కాస్త కష్టంగా ఉంది అనుకున్నాడో ఏమో రెండో ఇన్నింగ్స్ లో మాత్రం లిస్టర్ షైర్  తరపునకాకుండా టీమిండియా తరపున బ్యాటింగ్ చేయడానికి వచ్చాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం వేరే అన్నది అర్థం అవుతుంది.  నాలుగు రోజుల వార్మప్  మ్యాచ్లో వర్షం కురుస్తుండటంతో ఆటకు అంతరాయం ఏర్పడుతుంది.


 ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆటలో లిస్టర్ షైర్  తరఫున ఆడితే పుజారాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవచ్చని భావించింది టీమిండియా.  అందుకే  చటేశ్వర్ పుజారా ను లీస్టర్ షైర్ తరపునకాకుండా టీమిండియా తరపున బ్యాటింగ్ కు దించింది అని తెలుస్తోంది. అయినప్పటికీ పూజారా మరోసారి విఫలమయ్యాడు. 22 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో వికెట్ చేజార్చుకున్నాడు. అయితే మొన్నటి వరకు ఇంగ్లాండ్ కౌంటీలో సెంచరీలతో చెలరేగిన చటేశ్వర్ పుజారా భారీ అంచనాల మధ్య టీమిండియాలో అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: