రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడి టీమిండియా కు దూరం కావడం.. ఇక గజ్జల్లో గాయం కారణంగా వైస్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ సర్జరీతో  రెస్ట్ తీసుకుంటూ ఉండటం.. కారణంగా ఆ తర్వాత వైస్ కెప్టెన్ గా మారిపోయిన జస్ప్రిత్ బూమ్రా ఇక ఇటీవల కీలక టెస్ట్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక  బుమ్రా తనకు కెప్టెన్సీ దక్కడం అరుదైన గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జస్ప్రిత్ బూమ్రా కు కెప్టెన్సీ దక్కడంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా పలు సూచనలు సలహాలు చేస్తూ ఉండగా ఇదే విషయంపై బూమ్రా సతీమణి సంజన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 బూమ్రా ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అతని తల్లి కోరుకునేది. చిన్నప్పటి నుంచి బుమ్రా క్రికెట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆమె స్వయంగా కళ్లారా చూసింది. ఇలా ఎన్నో కష్టాలు పడి టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసి ఆమె ఎంతో గర్వంగా ఫీల్ అయింది. ఆమెకు క్రికెట్ గురించి పెద్దగా తెలియక పోయినా ఆటలో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలని విషయాలను ఎప్పుడూ చెబుతూ ఉండేది అంటూ చెప్పుకొచ్చింది సంజన. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీ అంత సులువుగా రాలేదు అంటూ చెప్పుకొచ్చింది సంజన.

 రోహిత్ శర్మ తర్వాత సారథ్య బాధ్యతలను సరిగ్గా నిర్వహించగలుగుతాడా లేదా అనే విషయంపై జట్టు యాజమాన్యం అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఇక జస్ప్రిత్ బూమ్రా కి జట్టు పగ్గాలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చింది. నా భర్త బుమ్రాకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కెప్టెన్సీ రావడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇది అర్థం చేసుకునేందుకు బుమ్రాకు కాస్త సమయం పట్టిందని తెలిపింది సజన. ఎట్టకేలకు టీమిండియా కెప్టెన్సీ వహించే అవకాశం రావడంతో బూమ్రా ఎంతో గర్వ పడుతున్నాడు అంటూ సంజన చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: