ఎన్నో ఆశలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా కు మొదటి అడుగులోనే నిరాశే ఎదురైంది. కాగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడినా టెస్ట్ మ్యాచ్ జులై 1వ తేదీన రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఆడింది ఇండియా. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడి దూరమవ్వడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారినపడి జట్టుకు దూరం అయినా కారణంగా ఎవరూ ఊహించని విధంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్సీ వహించాడు. దీంతో అతని కెప్టెన్సీలోని టీమిండియాతో ఎలా ఆడుతుందో అని అందరూ అనుకున్నారు.


 అయితే టీమిండియా బ్యాటింగ్ విభాగం ఆశించినట్లుగానే మంచి ప్రదర్శన కనబరిచింది. కానీ ఆ తర్వాత మాత్రం బౌలింగ్ విభాగం ఇంగ్లండ్ జట్టుపై పట్టుబిగించడంలో విఫలం అయింది అని చెప్పాలి. ఒకానొక దశలో టీమిండియాకు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడటంతో చివరికి టీమిండియాకు నిరాష తప్ప లేదు. ఎంతో అలవోకగా టీమిండియా నిర్దేశించిన టార్గెట్ ను చేదించిన ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ 2-2 తో సమం చేసింది. ఈ క్రమంలోనే  ఒక చెత్త రికార్డు టీమిండియా ఖాతాలో చేరిపోయింది అని చెప్పాలి.



 టెస్టు క్రికెట్ చరిత్రలోనే టీమిండియా మొదటి సారి ఇలాంటి పేలవమైన ప్రదర్శన చేసింది. తొలిసారి 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయింది టీమిండియా. ఇంగ్లాండ్ ముందు భారత జట్టు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే టీమిండియా విజయం తధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించింది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ లో వందకుపైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది ఓడిపోవడం టీమిండియాకు ఇదే మొదటిసారి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: