ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతో మంది బౌలర్లు తమ సత్తా చాటుతూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. టీమిండియా ఓడిన గెలిచిన తమ పేరు మాత్రం మారుమోగిపోయేలా చేసుకుంటున్నారు. ఇక ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమే చేసి చూపించాడు. ఆరు వికెట్లు మూడు మెయిడిన్ ఓవర్లు వేసి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు రెండవ వన్డే మ్యాచ్లో  యుజ్యేంద్ర చాహల్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది.


 కాగా మొదటి వన్డే మ్యాచ్లో అద్భుతంగా రాణించిన భారత జట్టు జట్టు.. రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం పెద్దగా ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే భారత జట్టుకు రెండో వన్డే మ్యాచ్ లో ఓటమి తప్పలేదు అనే చెప్పాలి. దీంతో టీ20 సిరీస్ లాగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుందని అందరూ నమ్మకం పెట్టుకుంటే.. టీమిండియా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే టీమ్ ఇండియా అటు ఓటమిపాలు అయినప్పటికీ టీమ్ ఇండియా లో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న యుజ్వేంద్ర చాహల్ మాత్రం అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు అన్నది తెలుస్తుంది.


 ఏకంగా 39 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు చాహల్. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానం లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేశాడు. 1983లో వరల్డ్ కప్ జరిగిన సమయంలో అమర్నాథ్ తీసిన మూడు వికెట్ల రికార్డును అధిగమించాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న చాహల్ 10 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో బెయిర్ స్టో, మోయిన్ అలీ, జో రూట్, బెన్ స్టోక్స్ లాంటి కీలక బ్యాట్స్మెన్ల వికెట్లు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: