భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు మాత్రమే కాదు క్రీడ సంబంధాలు   కూడా పూర్తిగా నిషేధించబడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా విదేశీ పర్యటనలకు వెళుతూ ఎక్కువగా సిరీస్ లూ ఆడే భారత జట్టు అటు పాకిస్థాన్ పర్యటనకు మాత్రం వెళ్ళదు. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు రాదు. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లూ జరగవు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే మాత్రం తప్పనిసరిగా ఇక వరల్డ్ కప్ జరగాల్సిందే అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో పాల్గొంటు కోట్ల రూపాయలు సంపాదిస్తే అటు పాకిస్థాన్ ఆటగాళ్లకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఒక ఐపీఎల్ మినహా మిగతా దేశాల ఫ్రాంచైజీ క్రికెట్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు భాగం అవుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో జరగబోయే యూఏఈ దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లలో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశం లేకపోలేదు.


 ఇప్పటికే ఐపీఎల్ కు చెందిన ఆరు ఫ్రాంఛైజీల కూడా దక్షిణాఫ్రికా, యూఏఈ  టీ20 లీగ్ లో ఉన్న జట్లను కొనుగోలు చేసాయి అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టి20 లీగ్ లో జట్లను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే  ఈ విషయంపై స్పందించిన ఆకాష్ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్లూ ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానుల కోసం క్రికెట్ ఆడబోతున్నాడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపిఎల్ లో ఆడే అవకాశం లేకపోయినా  ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా, యుఏఈ టీ20 లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంఛైజీల తో అటు పాకిస్తాన్ నాటకాలు బాగం అయ్యే అవకాశం ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl