క్రికెట్ కు సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది . బ్యాట్స్మెన్ కొట్టిన భారీ సిక్సర్.. ఫీల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్.. బౌలర్ తీసిన అదిరిపోయే వికెట్.. ఇలా క్రికెట్ కి సంబంధించి ఏ విషయం అయినా సరే ప్రేక్షకులకు బాగా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఎంతో మంది ఫీల్డర్లు కళ్లు చెదిరే క్యాచ్ లు పడుతున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడూ ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.



 ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన కళ్ళు చెదిరే క్యాచ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఒకవేళ సూపర్ మాన్ క్రికెట్ ఆడితే ఇక అచ్చం ఇలాగే క్యాచ్ పట్టే వాడేమో అని అనిపిస్తూ ఉంది ఈ క్యాచ్ చూసిన తర్వాత అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఒకవైపు ఎంతో వేగంగా మైదానంలో పరిగెత్తడమే కాదు చేతికి అందనంత దూరంలో ఉన్న బంతిని ఎంతో అలవోకగా గాల్లోకి డైవ్ చేసి పట్టుకున్నాడు ఇక్కడ ఒక ఫీల్డర్. ఇలా కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుని వార్తల్లో నిలిచింది ఎవరో కాదు దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో ఇలాంటి కళ్లు చెదిరే క్యాచ్ ఇచ్చాడు.


 ఈ క్రమంలోనే ఈ అద్భుతమైన క్యాచ్ చూసిన తర్వాత అతన్ని దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు రోడ్స్ తో పోలుస్తూ ఉండడం గమనార్హం. అప్పట్లో బౌలింగ్ బ్యాటింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా అభిమానుల మనసులు దోచుకున్నాడు రోడ్స్. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ కూడా కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో.. అచ్చం రోడ్స్ పట్టిన క్యాచ్ లాగే ఉంది అంటూ ఎంతో మంది అంటూ ఉండటం  గమనార్హం. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పదోవ లో మార్కరం  బౌలింగులో మోయిన్ అలీ  ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు. అయితే బంతి గాల్లోకి లేచింది. ఇక కవర్స్ లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ డ్రైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇక ఇది మ్యాచ్ మొత్తానికి బెస్ట్ క్యాచ్ గా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: