వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో కూడా సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. విజయం సాధించిన టీమిండియా ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక మూడవ టి20 మ్యాచ్ కేవలం నామమాత్రమైన మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే కీలకమైన మ్యాచ్ కాకపోవడంతో అటు టీమ్ ఇండియాలో ఉండే కీలకమైన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు.


 ఈ క్రమంలోనే అందరూ అనుకున్నట్లుగానే ప్రస్తుతం టీమిండియా ఆడబోయే మూడవ టి20 మ్యాచ్ లో భాగంగా తుదిచెట్టులో పలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు మూడవ టి20 మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఇటీవల జట్టు వివరాలు చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉండగా.. రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్,దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహార్ జట్టులో ఉన్నారు.


 అయితే గత కొంతకాలం నుంచి జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు కూడా విశ్రాంతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తోంది. అదే సమయంలో ఇక అటు వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున కీలకంగా మారబోతున్నాడు అనుకుంటున్న బౌలర్అర్షదీప్ కూడా ఆడటం లేదు. ఇకపోతే అటు టీమ్ ఇండియాకు నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ సౌత్ఆఫ్రికాకు మాత్రం పరువు నిలబెట్టుకునే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో సిరీస్ కోల్పోయిన చివరికి మూడో టి20 లో అయినా మ్యాచ్ గెలవాలని చూస్తుంది సౌత్ ఆఫ్రికా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: