గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో సంజు శాంసన్ కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో తనదైన ప్రదర్శనతో అదరగొట్టిన సంజు శాంసన్ భారీగా పరుగులు చేశాడు. ఒకప్పుడు కేవలం రెండు మూడు మ్యాచ్ లలో మాత్రమే బాగా రానించి ఆ తర్వాత నిరాశపరిచే వాడు సంజు శాంసన్.  కానీ ఇప్పుడు మాత్రం నిలకడగా రాణిస్తూ తనదైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్న టీమ్ ఇండియా తరపున కూడా అద్భుతంగా రానిస్తున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదిక అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తుదిజట్టులో సంజు శాంసన్ తప్పక చోటు దక్కుతుందని అభిమానులు భావించారు. కానీ బిసిసిఐ మాత్రం సంజు శాంసన్ పరిగణలోకి తీసుకోలేదు. కనీసం స్టాండ్ బై ప్లేయర్ గా కూడా అతని ఎంపిక చేయలేదు. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజు శాంసన్ విషయంలో బీసీసీఐ వివక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ నిరసనలు చేపట్టడం కూడా చూశాం.


 చివరికి అభిమానులను కాస్త చల్లార్చేందుకు ఇటీవలే టీమిండియా సౌత్ ఆఫ్రికా తో ఆడుతున్న వన్డే లో అవకాశం కల్పించింది బీసీసీఐ. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా మరోసారి అభిమానులుఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి వన్డే  మ్యాచ్ లో సంజు శాంసన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 63 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఒక రకంగా భారత జట్టును విజయం అంచుల వరకు తీసుకువెళ్లాడు అని చెప్పాలి. ఇందులో 9 ఫోర్లు రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం. అయితే సంజు శాంసన్ ఇలాంటి ప్రదర్శన చేయడంతో ఇలాంటి ఆటగాన్ని వరల్డ్ కప్ కోసం ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: