ఈ క్రమంలోనే ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ మ్యాచ్ లలో మునిగి తేలిన టీమిండియా ఇక ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను సమర్థవంతంగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలోనే ఇక ఒక చర్చకు మాత్రం ఇప్పటికి ఆన్సర్ దొరకలేదు అని చెప్పాలి. అదే తుదిచెట్టులో దినేష్ కార్తీక్ చోటు సంపాదించుకుంటాడా లేకపోతే రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
కొంత మంది పంత్ జట్టులో ఉండాలని కోరుకుంటూ ఉంటే.. ఇంకొంత మంది దినేష్ కార్తీక్ అయితే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం పై ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక రేపే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యం లో ఇక ఈ మ్యాచ్లో తుది జట్టు లో దినేష్ కార్తీక్ ఉంటాడా లేకపోతే పంత్ చోటు సంపాదించుకుంటాడ అనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ తుదిచెట్టులో ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి