ఈ క్రమంలోనే 90 వేల మంది ప్రేక్షకుల నడుమ దాయాదుల పోరు మరింత రసవత్తరంగా మారబోతుంది అన్నది మాత్రం తెలుస్తూ ఉంది ఇకపోతే ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా టీవీల ముందు కూర్చొని మ్యాచ్ వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఇక టి20 ప్రపంచ కప్ లో భాగంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న పాకిస్తాన్ భారత్ మధ్య జరిగే మ్యాచ్లో టాస్ కూడా ఎంతో కీలకం కానుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి వరుణ గండం పొంచి ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇక 20 ఓవర్ల మ్యాచ్ కాస్త తక్కువ ఓవర్లకు కుదిస్తారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వర్షం కారణంగా పరిమిత ఓవర్లలో మ్యాచ్ జరిగిన కూడా తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు వెళ్లకపోవడం పై స్పందించిన రోహిత్ శర్మ ప్రస్తుతం తమ దృష్టంతా వరల్డ్ కప్ మీద ఉందని ఆసియా కప్ మీద కాదు అంటూ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి