ప్రస్తుతం భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కొత్త కెప్టెన్ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ.. ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా కప్ సాధించి భారత జట్టును విశ్వవిజేతగా నిలుపుతాడని భారత అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక అందరూ అనుకుంటున్నట్లుగానే రోహిత్ శర్మ కూడా తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తూ మంచి విజయాలను అందిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన సౌత్ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఓటమిపాలు అయింది అని చెప్పాలి.


 అయితే టీమిండియా సౌత్ ఆఫ్రికా తో ఓడినప్పటికీ మిగతా మ్యాచ్ లలో మాత్రం పసికూన జట్లతో మాత్రమే మ్యాచ్ ఉండడంతో ఇక టీమిండియా తప్పక గెలిచి తీరుతుందని సెమిస్ లో అడుగుపెడుతుందని ఎంతోమంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు ఒక కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఓపనర్ గా వచ్చి పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ గురించి అందరూ విమర్శలు చేస్తున్నారు. కానీ రోహిత్ ప్రదర్శనను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.


 బలహీనమైన బౌలింగ్ లైనప్ ఉన్నా నెదర్లాండ్స్ పై మినహా రోహిత్ శర్మ మిగతా మ్యాచ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్లో కూడా ఎన్నో చాన్సులు వచ్చాయి అని చెప్పాలి. లేదంటే తక్కువ పరుగులకే అవుట్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీ ఒత్తిడిలో  బ్యాటింగ్ ఫామ్ కోల్పోతున్నాడు. బ్యాటింగ్ పై కూడా దృష్టి పెడితే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వకపోతే టీమిండియా విజయాలు సాధించడం కష్టం అంటూ ఎంతో మంది విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: