సాధారణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే క్రీడాకారులకు సోషల్ మీడియాలో పాపులారిటి కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక క్రీడాకారులకు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలా కేవలం నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఆటకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ తెరమీదకి వస్తూనే ఉంటాయి. కానీ ఇక క్రీడాకారుల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ప్రేమ, రిలేషన్షిప్ కి సంబంధించిన విషయాలు ఏదైనా బయటికి వస్తే ఇక మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయిపోతుంది.


 దీంతో ఎక్కడ చూసినా ఇక అందుకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలీ. ఇక ఇటీవల కాలంలో కొంతమంది క్రికెటర్లు ఏకంగా పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని అవాక్కాయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు అభిమానులను సైతం షాక్ లో మునిగిపోయేలా చేస్తున్నాయ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇంగ్లాండ్ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న స్టువర్టు బ్రాడ్ ఇటీవల తండ్రి అయ్యాడు.


 తండ్రి అయ్యాడు అంటే శుభవార్త కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అతను పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. తన కాబోయే భార్య మోలి కింగ్ ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చింది. తమ కూతురి ఫోటోను మోలి కింగ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిన్నారికి అన్నాబెల్లా బ్రాడ్ అని పేరు కూడా పెట్టడం గమనార్హం. కాగా బ్రాడ్, మోలి చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇలా చివరికి పెళ్లి కాకముందే తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్   టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: