ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల లీగ్ మ్యాచ్లు జరగ్గా.. ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్లు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ నాకౌట్ మ్యాచ్లలో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న అన్ని జట్లు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచెందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా జట్ల అభిమానులు కూడా భారీగా స్టేడియం కు చేరుకొని ఇక తమ అభిమాన జట్టుకు మద్దతు పలకడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 సాధారణంగా ఉత్కంఠమైన నాకౌట్ మ్యాచ్ జరిగిన సమయంలో ఇక తమ అభిమాన జట్టుకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన అభిమానులు.. ఒకవేళ ఆ జట్టు ఓడిపోతుంది అని తెలిస్తే ఇక నిరాశతో మ్యాచ్ ముగియడానికి ముందే స్టేడియం నుంచి వెళ్లిపోవడం లాంటిది ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం జపాన్ జట్టుకు సంబంధించిన అభిమానులు చేసిన పని మాత్రం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న లీగ్ స్టేజ్ లో జపాన్ గెలిచిన సమయంలో ఆ జట్టు అభిమానులు స్టేడియంలో ఉన్న చెత్తను మొత్తం ఏరివేసి అందరికి ఆదర్శంగా నిలిచారు.


 ఇకపోతే ఇటీవలే తమ టీం ఓడిపోయిన సమయంలో కూడా వారు చేసిన పని అందరిని ఫిదా చేసింది అని చెప్పాలి  వరల్డ్ కప్ రౌండ్ 16 లో భాగంగా జపాన్ ఓడిపోవడంతో చివరికి వరల్డ్ కప్ గెలవాలి అన్న ఆశలు ఆవిరి అయ్యాయి అని చెప్పాలి. దీంతో ఈసారి కప్పు గెలుస్తుంది అనుకున్న జట్టు ఓడిపోవడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక ఇలా హార్ట్ బ్రేకింగ్ సమయంలో కూడా జపాన్ అభిమానులు ఏకంగా స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: